ఇళ్లకు వెళ్లేదే లేదు.. చేతికొచ్చే పంటల త్యాగానికి రైతులు సిద్ధమవ్వాలి: రైతు సంఘం నేత తికాయత్

BKU Leader Rakesh Tikait: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకూ తాము ఇళ్లకు వెళ్లమని బీకేయూ నాయకుడు రాకేష్‌ తికాయిత్‌ మరోసారి స్పష్టంచేశారు. అవసరమైతే రైతులు పంటలు త్యాగం చేసేందుకు సిద్ధం కావాలంటూ..

ఇళ్లకు వెళ్లేదే లేదు.. చేతికొచ్చే పంటల త్యాగానికి రైతులు సిద్ధమవ్వాలి: రైతు సంఘం నేత తికాయత్
Rakesh Tikait
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 19, 2021 | 12:35 AM

BKU Leader Rakesh Tikait: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకూ తాము ఇళ్లకు వెళ్లమని బీకేయూ నాయకుడు రాకేష్‌ తికాయిత్‌ మరోసారి స్పష్టంచేశారు. అవసరమైతే రైతులు పంటలు త్యాగం చేసేందుకు సిద్ధం కావాలంటూ ఆయన సూచించారు. పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. ఇలాంటి ధోరణి తగదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చేతికి వచ్చిన పంటలను కూడా త్యాగం చేసేందుకు రైతులు సిద్ధమవ్వాలన్నారు. హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలోని ఖరక్ పూనియా గ్రామంలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో తికాయత్ మాట్లడారు. రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లిపోతారనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదని పేర్కొన్నారు. ఓవైపు పంటలను సాగుచేయడంతో పాటు మరోవైపు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

ఒకవేళ చేతికి వచ్చిన పంటను తగులబెట్టాల్సి వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే ప్రణాళికలో భాగంగా వ్యవసాయ సంఘాలు ఇచ్చే తదుపరి కార్యాచరణకు రైతులు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లను నిర్వహిస్తామని తికాయిత్‌ వెల్లడించారు. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమంగా ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read:

Urmila matondkar: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాలీవుడ్‌ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ సెటైర్లు

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?