Yogi Adityanath: ఐదేళ్ల తరువాత తల్లిని కలుసుకున్న యూపీ సీఎం.. అమ్మ సావిత్రి ఆశీస్సులు తీసుకున్న యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల తర్వాత మంగళవారం తన గ్రామానికి చేరుకున్నారు. తన తల్లి సావిత్రిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

Yogi Adityanath: ఐదేళ్ల తరువాత తల్లిని కలుసుకున్న యూపీ సీఎం.. అమ్మ సావిత్రి ఆశీస్సులు తీసుకున్న యోగి
Cm Yogi

Edited By:

Updated on: May 04, 2022 | 6:26 PM

Uttar Pradesh CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల తర్వాత మంగళవారం తన గ్రామానికి చేరుకున్నారు. తన తల్లి సావిత్రిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపారు. దాదాపు ఐదేళ్ల క్రితం 2017లో ఎన్నికలకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఇంటికి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్ చేరుకున్న సీఎం యోగికి గ్రామస్తులు ఘన స్వాగతం లభించింది. ఉత్తరాఖండ్ చేరుకున్న యోగికి మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వాగతం పలికారు.

రెండోవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మొదటిసారిగా తన స్వగ్రామం యమకేశ్వర్‌లోని పంచూర్ చేరుకున్నారు. పంచూర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని బిత్యానిలో ఉన్న మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో గురు మహంత్ అవద్యనాథ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువును స్మరించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కళ్లు చెమ్మగిల్లాయి.

విగ్రహావిష్కరణ కార్యక్రమం తర్వాత, యోగి తన తల్లి సావిత్రి దేవి, కుటుంబ సభ్యులను కలవడానికి ఇంటికి చేరుకున్నారు. కుమారుడి రాకతో కుటుంబంలో ఉత్సాహం నెలకొంది. సీఎం యోగి ఇక్కడికి చేరుకోగానే ఆయన్ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండోసారి సీఎం అయిన తర్వాత యోగి ఉత్తరాఖండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా పాల్గొన్నారు.


సీఎం యోగి ఆదిత్యానాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఏప్రిల్ 20, 2020న మరణించారు. అప్పుడు కరోనా పీరియడ్ బిజీ కారణంగా సీఎం యోగి చేరుకోలేకపోయారు.యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లి ఆశీస్సులు తీసుకునేందుకు గ్రామానికి వస్తానని చెప్పారు. ఆయన రాకపై యామకేశ్వరంలో ఉత్కంఠ నెలకొంది. బహిరంగ సభలో ఆయనను వినేందుకు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంత వాసులు బిత్యాని వద్దకు చేరుకున్నారు.

Read Also…. Andhra Pradesh: హోం మంత్రి కారుపై చేయి పడితే నా కారుపై పడినట్లే.. మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్య