అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జీ20 సదస్సును ముగించుకొని వియత్నాం బయల్దేరారు. ఆదివార ఉదయం ఆయన రాజ్‌ఘట్‌లోని మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తన ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో బయలుదేరి వెళ్లారు. మరో విషయం ఏంటంటే జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఇండియాలో తొలిసారిగా పర్యటించారు. శుక్రవారం రోజున ఆయన తన పర్యటనలో మొదటిరోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే బైడెన్ వియాత్నం ఎందుకు వెళ్లనున్నారనే విషయంపై ప్రశ్నలు వచ్చాయి. అయితే అక్కడ కూడా ఆయన ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై దృష్టి సారించనున్నారు. అలాగే ఆదివారం, సోమవారాల్లో ఆయన ఉండనున్నారు. అక్కడ జరగనున్న కార్యకలాపాల్లో కూడా ఆయన మాస్క్ ధరించే పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా బైడెన్ కాన్వాయ్‌లో ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రిపూట భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతడి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. దీంతో అతడిని దళాలు ప్రశ్నించాయి. అలాగే బైడెన్ తన కాన్వయ్‌లోని కొన్ని వాహనాలు నేరుగా అమెరికా నుంచే వచ్చాయి. అలాగే మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. అయితే వీటిల్లో అద్దెతు తీసుకున్న కారు కూడా ఒకటి ఉంది. మరో విషయం ఏంటంటే బైడెన్ బసచేసేటటువంటి హోటల్.. ఐటీసీ మౌర్య వద్ద ఉండాల్సి ఉంది. అలాగే యూఏఈ పాలకుడు అయిన అల్ నహ్యన్ బస చేస్తు్న్న తాజ్ హోటల్ వద్ద కూడా అది కనిపించింది. అయితే ఓ వ్యాపారవేత్తను అక్కడ డ్రాప్ చేసేందుకు తాను వచ్చినట్లు ఆ డ్రైవర్ అధికారులు వివరించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ గురించి మాత్రం తనకు తెలియదని అన్నారు. అయితే అతడ్ని కొన్ని గంటల వరకు ప్రశ్నించిన తర్వాత భద్రతా దళాలు అతడ్ని చివరికి వదిలేసి వెళ్లాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీలో రెండురోజు పాటు జరిగినటువంటి జీ20 సదస్సు ఆదివారం రోజున ముగిసింది. రష్యా, ఉక్రెయన్ యుద్ధం నేపథ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ జరిగినటువంటి ప్రార్థనలతో సదస్సు ముగిసిందని ప్రధాని మోదీ అన్నారు. జీ20 సదస్సు సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తున్నానని.. వసుధైక కుటుంబానికి రోడ్‌మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ముగింపు ఉపన్యాసంలో చెప్పారు. ఇక చివరగా జీ20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందజేశారు. అయితే ఈ సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్ష జరిపేందుకు ఈ ఏడాది నవంబర్ నెల చివర్లో వర్చువల్ భేటీ జరగాలని ప్రధాని మోదీ ప్రతిపాదన చేశారు. జీ20 సదస్సులో ముందుకొచ్చినటువంటి సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
US President Joe Biden departs for Vietnam, take a look at key takeaways of India visit
Read @ANI Story | https://t.co/IHeIsh2EWB#JoeBiden #USPresident #Vietnam #India pic.twitter.com/SXk8e1zj3F
— ANI Digital (@ani_digital) September 10, 2023