Good News: అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలో వీసాల కోసం ఇంటర్వ్యూలు..

|

Jun 27, 2022 | 8:10 AM

ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు (Student Visa), స్లాట్లు బుక్​చేసుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది. స్లాట్లను ఓపెన్​చేసినట్టు ప్రకటించింది.

Good News: అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. త్వరలో వీసాల కోసం ఇంటర్వ్యూలు..
Visa
Follow us on

Good news for students: అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు యూఎస్​రాయబార కార్యాలయం (US Embassy) శభవార్త చెప్పింది. ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు (Student Visa), స్లాట్లు బుక్​చేసుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది. స్లాట్లను ఓపెన్​చేసినట్టు ప్రకటించింది. స్టూడెంట్​విసా అపాయింట్‌మెట్లు వెబ్​సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఇంటర్వ్యూ స్లాట్స్​ఓపెన్‌ చేశామని స్పష్టం చేసింది. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఇక వెయిట్‌ చేయొద్దని సూచించింది, యూఎస్​రాయబార కార్యాలయం. ఎఫ్, ఎం, జే.. వీసాల కోసం ఆగస్టు 14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయనిని ట్వీట్‌ చేసింది, ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం. 2022 జూన్-జులై జరగాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్​ చేసింది అమెరికా. తాజాగా మరో దఫా ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది.

ఈ ఇంటర్వ్యూలు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్స్‌లో జరుగనున్నాయి. అమెరికా వర్సిటీల్లో చదువుకునేందుకు ప్లాన్‌ చేసుకున్న విద్యార్థులకు ఇప్పటికే ఐ-20 పత్రాలు అందాయి. ఆయా వర్సిటీలు, విద్యార్థులకు ఐ-20 డాక్యుమెంట్లు ఇచ్చాయి. కానీ, వారికి ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వీసా లభించలేదు. దీంతో వారందరు ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నారు. భారత విద్యార్థుల వీసా విషయంపై విదేశాంగశాఖ ఇటీవలే పలు దేశాలతో చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనాల కోసం వీసాలు త్వరితగతిన మంజూరు చేయాలని అభ్యర్థించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..