UPSC IFS Main 2021: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ 2021 హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఈ తేదీల్లోనే!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS Main) మెయిన్స్‌ పరీక్షల 2021 కోసం ఇ-అడ్మిట్ కార్డ్‌లను ఫిబ్రవరి 7 (సోమవారం)న విడుదల చేసింది...

UPSC IFS Main 2021: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ 2021 హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఈ తేదీల్లోనే!
Upsc Ifs
Follow us

|

Updated on: Feb 07, 2022 | 8:59 PM

Download UPSC IFS Mains 2021 Admit Card: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS Main) మెయిన్స్‌ పరీక్షల 2021 కోసం ఇ-అడ్మిట్ కార్డ్‌లను ఫిబ్రవరి 7 (సోమవారం)న విడుదల చేసింది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www. upsc.gov.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఈ రోజు నుంచి మార్చి 6 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా యూపీఎస్సీ నిర్వహించే ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్ 2021 పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6, 2022 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. భోపాల్, చెన్నై, ఢిల్లీ, డిస్పూర్ (గౌహతి), హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, పోర్ట్ బ్లెయిర్, సిమ్లాతో సహా దేశవ్యప్తంగా వివిధ నగరాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు. మెయిన్స్‌ రాయడానికి అర్హులౌతారు. అభ్యర్ధల సందేహాల నివృతికి హెల్ప్‌లైన్ నంబర్ 011-23385271ని సంప్రదించవచ్చు. దీనితో పాటు webcell-upsc@nic.in ఈ-మెయిల్ ద్వారా కూడా సందేహాలు నివృతి చేసుకోవచ్చు.

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్ పరీక్ష 2021 అడ్మిట్ కార్డ్‌లను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో ‘ఈ-అడ్మిట్ కార్డ్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2021’పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే న్యూ విండో (కొత్త పేజీ) ఓపెన్‌ అవుతుంది.
  • డౌన్‌లోడ్‌ ఇ-అడ్మిట్ కార్డ్‌ పై క్లిక్‌ చెయ్యాలి.
  • ఇచ్చిన ఇన్‌స్ట్రక్చర్స్ ను క్లియర్‌గా చదివి యస్‌(Yes) పై క్లిక్‌ చెయ్యాలి.
  • లాగిన్‌ అవ్వడానికి రిజిస్ట్రేషన్‌ ఐడీ లేదా రోల్‌ నంబర్‌ ఎంటర్ చెయ్యాలి.
  • తర్వాత ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ 2021 అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ ఔట్‌ తీసుకోవాలి.

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతి సెషన్‌లో ఎగ్జామినేషన్ హాల్‌లోపలికి ప్రవేశం పొందాలంటే విధిగా ఈ-అడ్మిట్ కార్డును తమతోపాటు తీసుకెళ్లాలి. ఈ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్ధుల సంఖ్య భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్య కంటే దాదాపు రెండింతలు ఉంటుంది. ఇంటర్వ్యూ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా అభ్యర్థులు ప్రధాన, ఇంటర్వ్యూ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read:

BHEL Welder Recruitment 2022: నెలకు రూ.37,500ల జీతంతో బీహెచ్‌ఈఎల్‌లో వెల్డర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?