ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

|

Jul 31, 2020 | 2:08 PM

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..అయితే, జాగ్రత్త మీ పర్స్ ఖాళీ కావటం ఖాయం. అదేంటి..ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తే.. ఎంతో కొంత ఫైన్ పడుతుంది..అంతే కాదా ? అనుకోవద్దు..ఎందుకంటే..ఇప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ..డ్రైవింగ్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా..

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా
Follow us on

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..అయితే, జాగ్రత్త మీ పర్స్ ఖాళీ కావటం ఖాయం. అదేంటి..ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తే.. ఎంతో కొంత ఫైన్ పడుతుంది..అంతే కాదా ? అనుకోవద్దు..ఎందుకంటే..ఇప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ..డ్రైవింగ్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధించేందుకు అక్కడి సర్కార్ సిద్ధమవుతోంది.

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి పది వేల రూపాయాల జరిమానా విధించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖ దీనికి సంబంధించిన ఆదేశాలను ఈ నెల 30వ తేదీన జారీ చేసింది. జూన్ నెలలో రాష్ట్రప్రభుత్వం డ్రైవింగ్ నిబంధనలపై కొత్త చట్టాన్ని తయారు చేసింది. రోడ్డు భద్రత అంశంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్లు నాలుగు రేట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదికలో వెల్లడించింది.

Read More:

వరకట్న వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి