కలవర పెడుతున్న గ్యాస్ లీక్.. భయపడుతున్న ముంబై వాసులు

మొన్నటివరకు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబై వాసులు తాజా మరో సమస్యతో సతమతమవుతున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో గత రాత్రినుంచి వారికి నిద్రలేకుండా గడుపుతున్నారు. గుర్తు తెలియని  వాయువులు వ్యాపించడంతో వారు భయందోళనకు గురయ్యారు. ఈ వాయువుల్ని పీల్చి  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివరాలు చూస్తే ముంబై నగరపాలక సంస్ధ పరిధిలో పశ్చిమ ముంబైలో చెంబర్, మన్‌కర్డ్,గోవండి,చాంద్‌వాలీ, పోవై,ఘట్కొపర్, అంథేరీ ప్రాంతాల్లో గురువారం రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాసన వ్యాపించింది. చెంబర్ […]

కలవర పెడుతున్న గ్యాస్ లీక్.. భయపడుతున్న ముంబై వాసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 20, 2019 | 5:10 PM

మొన్నటివరకు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబై వాసులు తాజా మరో సమస్యతో సతమతమవుతున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో గత రాత్రినుంచి వారికి నిద్రలేకుండా గడుపుతున్నారు. గుర్తు తెలియని  వాయువులు వ్యాపించడంతో వారు భయందోళనకు గురయ్యారు. ఈ వాయువుల్ని పీల్చి  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివరాలు చూస్తే ముంబై నగరపాలక సంస్ధ పరిధిలో పశ్చిమ ముంబైలో చెంబర్, మన్‌కర్డ్,గోవండి,చాంద్‌వాలీ, పోవై,ఘట్కొపర్, అంథేరీ ప్రాంతాల్లో గురువారం రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాసన వ్యాపించింది.

చెంబర్ ప్రాంతంలో ఉన్న రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైందని, ఇది చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించించిందని వదంతులు వ్యాపించాయి. ఈ వాయువులు పీల్చితే ప్రాణాలకే ప్రమాదకరమని ముంబై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో గ్యాస్ లీక్ అయ్యిందనే వార్తలు నగరం మొత్తాన్ని కలవర పెడుతున్నాయి. ఇవి విషవాయువులే అయ్యింటాయని ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు 19 ఫిర్యాదులు అందాయని ముంబై పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ వాయువుల వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, దీనికి కారణం ఏమిటనే విషయాన్న పరిశీలిస్తున్నామని బ్రెహన్ ముంబై అధికారులు తెలిపారు.