Ashwini Vaishnaw: ఇకపై మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటింటికీ పోస్టల్ సేవలు.. ఐటీ మంత్రి కీలక ప్రకటన

Union Minister Ashwini Vaishnaw: పోస్ట్ ఆఫీస్‌లను డిజిటల్ పవర్డ్ నెట్‌వర్క్‌గా మార్చే క్రమంలో మరో ముందుడుగు పడింది. ఈమేరకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ డైరెక్టర్ జనరల్ (DG UPU) మసాహికో మెటో మంగళవారం కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి, కీలక చర్చలు నిర్వహించారు.

Ashwini Vaishnaw: ఇకపై మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటింటికీ పోస్టల్ సేవలు.. ఐటీ మంత్రి కీలక ప్రకటన
Ashwini Vaishnaw

Updated on: Jul 19, 2023 | 9:19 AM

Union Minister Ashwini Vaishnaw: పోస్ట్ ఆఫీస్‌లను డిజిటల్ పవర్డ్ నెట్‌వర్క్‌గా మార్చే క్రమంలో మరో కీలక అడుగు పడింది. ఈమేరకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ డైరెక్టర్ జనరల్ (DG UPU) మసాహికో మెటోతో కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమావేశమయ్యారు. ఈమేరకు మారుమూల ప్రాంతాలలో పోస్టల్ సేవలను డోర్‌స్టెప్ డెలివరీ చేయగల సామర్థ్యంపై పనిచేస్తున్నట్లు వారు ప్రకటించారు. అలాగే, యూపీఐ సేవలను సరిహద్దు ప్రాంతాలకు విసర్తించడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు వారు తెలిపారు.

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ను గ్లోబల్ పోస్టల్ నెట్‌వర్క్‌ని అనుసంధానించేందుకు UPI నెట్ వర్క్ పై అధ్యయనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో UPU ప్రాంతీయ కార్యాలయాన్ని భారత్ లో ప్రారంభించనున్నారు. ఈమేరకు యూపీయూ డైరెక్టర్ మసాహికో మెటో భారతదేశంలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

“ఫిజికల్ పోస్ట్ ఆఫీస్‌ల విస్తరణపై మసాహికో మెటో ప్రశంసలు కురిపించారు. ఇతర దేశాలలో ఇలాంటి నమూనాలను ప్రయత్నించేందుకు కీలక అడుగు పడింది. పోస్టల్ ద్వారా సరిహద్దుల్లో డబ్బు చెల్లింపులను అనుసంధానించడానికి UPI ప్లాట్‌ఫారమ్‌ను అంచనా వేయడానికి కూడా వారు అంగీకరించారు” అని ఐటీ మంత్రి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..