Nirmala Sitharaman: పారిశ్రామిక వర్గాలతో చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ

దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఎంతో కసరత్తు తర్వాతే దానిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..

Nirmala Sitharaman: పారిశ్రామిక వర్గాలతో చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
Nirmala Sitharaman
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 05, 2022 | 7:17 PM

Nirmala Sitharaman: దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు (Petroleum Products), క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌(Windfall tax) పెంపు నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఎంతో కసరత్తు తర్వాతే దానిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు. పరిశ్రామిక ర్గాలతో చర్చించాకే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ నిర్ణయం ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుందని ప్రచారం చేయడం సరికాదన్నారు. పరిశ్రమ వర్గాల నుంచి సంప్రదింపుల తర్వాతే ఈనిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి 15 రోజులకోసారి పన్ను రేట్లను సమీక్షించాలన్న వారి సూచన మేరకే తాము ముందుకెళుతున్నామన్నారు. అదనపు పెట్టుబడులు-శ్రమ లేకుండానే చమురు సంస్థలకు లభిస్తున్న విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌పై సుంకాన్ని ఈ ఏడాది జులై 1న ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే.

తాజాగా విండ్ ఫాల్ ప్రాఫిట్ పై సెప్టెంబర్‌ 1న సమీక్షించిన కేంద్రం.. డీజిల్‌, విమాన ఇంధనం ఎగుమతిపై, దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిర్మలాసీతారామన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే కోవిడ్ (Covid) తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రభుత్వానికి నిధుల ప్రవాహం అనుకున్న స్థాయిలో ఉండడం లేదని తెలిపారు. ప్రస్తుతం ట్యాక్స్‌ జీడీపీ నిష్పత్తి 10 శాతంగా ఉందని, దీన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోందని పేర్కొన్నారు. అందుకు అనేక సంప్రదింపులు, విశ్లేషణ అవసరం అన్నారు. ప్రైవేటీకరణకు, బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని పునురుద్ఘాటించారు. ఎల్‌ఐసీలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ జరిపామని, ఇదే తరహాలో బ్యాంకింగ్‌ రంగంలోనూ ముందుకెళ్తామని తెలిపారు. రాబోయే 25 ఏళ్లలో వందో స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాల్సి ఉందన్నారు. దీనికోసం సంస్కరణలు చేపట్టడంతో పాటు సుస్థిరాభివృద్ధి సాధించాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!