Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ.. ఆ రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ వరాల జల్లు..

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించడం కోసం రాజకీయ పార్టీలు ఉచిత హామీల జపం చేస్తోంది. ఇటీవల కాలంలో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినప్పటికి.. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచిత హామీలనే నమ్ముకుంటున్నాయి. ఇటీవల కాలంలో..

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ.. ఆ రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ వరాల జల్లు..
Rahul Gandhi
Follow us

|

Updated on: Sep 05, 2022 | 6:39 PM

Rahul Gandhi: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించడం కోసం రాజకీయ పార్టీలు ఉచిత హామీల జపం చేస్తోంది. ఇటీవల కాలంలో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినప్పటికి.. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచిత హామీలనే నమ్ముకుంటున్నాయి. ఇటీవల కాలంలో పంజాబ్ ఎన్నికల్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీని ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో.. ఈఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ 300 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే పంజాబ్ లో వలె 300 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు విద్యుత్తు బిల్లులు ఉండవని హామీనిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హామీలకు తెరలేపింది.

ఈఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగిన ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈసందర్భంగా గుజరాత్ ప్రజలకు వరాలజల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్ ను రాయితీపై రూ.500కే ఇస్తామని, రైతులకు ఉచిత విద్యుత్తుతో పాటు, గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గుజరాత్ యువతకు 10 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, 3,000 ఆంగ్ల మాద్యమ పాఠశాలల నిర్మాణం చేపడతామని, బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక వేత్తలకు బీజేపీ రుణమాఫీ చేస్తుందని, రైతుల రుణాలను మాఫీ చేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పటికే బాలికల విద్య, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో.. ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో వెళ్తున్నట్లు రాహుల్ గాంధీ తాజా హామీలతో తెలుస్తోంది. మరి ప్రజలు ఎవరి హామీలను విశ్వసిస్తారనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.