Tamil Nadu Election 2021: తమిళనాడులో ఎలక్షన్ హీట్.. ఒక్కరోజు సీఎంను కలిసిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ.. అనేక చర్యలు తీసుకుంటుంది. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి...

Tamil Nadu Election 2021: తమిళనాడులో ఎలక్షన్ హీట్.. ఒక్కరోజు సీఎంను కలిసిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Updated on: Mar 09, 2021 | 1:07 PM

Tamil Nadu Election 2021 : దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ.. అనేక చర్యలు తీసుకుంటుంది. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పయించింది. తమిళనాడు ఎన్నికల ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి ఇప్పటికే అక్కడ స్థానిక పరిస్థితులపై దృష్టి సారించారు.. ప్రముఖులకు గేలం వేస్తున్నారు. తాజాగా సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

అర్జున్ ను బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలని కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి తో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ కూడా ఉన్నారు. అయితే అర్జున్ తనకు రాజకీయంపై అంతగా ఆసక్తి లేదని ఇటీవలే ప్రకటించారు. తన నేచర్, ఆలోచన విధానం రాజకీయాలకు ఏ మాత్రం సూట్ కాదని చెప్పారు. ఇక తనకు రాజకీయాల్లో పాల్గొనే టాలెంట్ లేదన్నారు అర్జున్.

నటుడు నిర్మాత, దర్శకుడు అర్జున్ సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నా.. ఒకే ఒక్కడు మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు.. ఆ సినిమాలో అర్జున్ ఒక్క రోజు సీఎం గా మారి సమాజంలో ఒక మంచి దృక్పధం ఉన్న వ్యక్తి పదవిని చేపడితే.. ప్రజలు ఎంత మేలు చేయవచ్చో చూపించారు. అయితే అది సినిమాల్లో మాత్రమే సాధ్యమని.. నిజ జీవిత రాజకీయాల్లో అది ఇప్పటికే సాధ్యం కాదని అర్జున్ వ్యాఖ్యానించినట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

Also Read:

Hero Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్.. కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు..

ధ్యానం, యోగా, పూజ ఇలా ఏ సందర్భంలో నైనా భూమి మీద నేరుగా కూర్చోవద్దు అనేది పెద్దల మాట ఎందుకో తెలుసా..!