Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: యువతకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీపి కబురు

యువతకు తీపి కబురు అందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు గనుల రంగంలో త్వరలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని భరోసానిచ్చారు. మరోవైపు దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి....

Kishan Reddy: యువతకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీపి కబురు
Kishan Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 22, 2025 | 6:45 AM

దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుండటంతో విద్యుదుత్పత్తి కూడా పెరుగుతోందన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల మూడో జాతీయ సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్నారు.

దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం భాగస్వామ్యం 2 శాతంగా ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు 1.86 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2024లో 997 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. 2014తో పోల్చుకుంటే ఏకంగా 76% మేర ఉత్పత్తి పెరిగిందని, 2030 నాటికి 1.5 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు కిషన్‌రెడ్డి. ఈ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు కిషన్‌రెడ్డి.

అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం మైనింగ్ నిఘా వ్యవస్థను ప్రారంభించిందని, దీనిని అరికట్టేందుకు రాష్ట్రాల సహకారం తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. గనుల రవాణా బిడ్డింగ్ ద్వారా 2015లో 55,636 కోట్లు రాగా, 2024లో రాయల్టీ రూపంలో రాష్ర్టాలకు రూ.2.69 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కీలకమైన ఖనిజాల అన్వేషణలో దేశం త్వరలో గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!
ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!
ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!
ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!
అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
బుట్టబొమ్మ స్టైలే వేరు.. పింగ్ లేహెంగాలో అదిరిపోయిన పూజాహెగ్దే
బుట్టబొమ్మ స్టైలే వేరు.. పింగ్ లేహెంగాలో అదిరిపోయిన పూజాహెగ్దే