Dharmendra Pradhan: చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన కేంద్ర మంత్రి.. ‘దేవాలయం’ అంటూ విద్యార్థులతో కలిసి సందడి..

|

Jun 24, 2023 | 8:07 PM

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాను చదువుకున్న ఒడిశాలోని తాల్చేర్‌ ‘హందీధువా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల’ని శనివారం సందర్శించారు. ఈ స్కూల్‌లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆయన.. తన సందర్శన సందర్భంగా పాఠశాలలోని ..

Dharmendra Pradhan: చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన కేంద్ర మంత్రి.. ‘దేవాలయం’ అంటూ విద్యార్థులతో కలిసి సందడి..
Union Minister Dharmendra Pradhan in his Old School
Follow us on

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాను చదువుకున్న ఒడిశాలోని తాల్చేర్‌ ‘హందీధువా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల’ని శనివారం సందర్శించారు. ఈ స్కూల్‌లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న ఆయన.. తన సందర్శన సందర్భంగా పాఠశాలలోని ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్కూల్‌లోని తన చిన్నప్పటి జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకుంటూ ‘ఈరోజు పాఠశాల ఆవరణలోకి అడుగుపెట్టగానే నాలో ఆనందం కలిగింది. అప్పటి టీచర్స్ అయిన దుర్గా సార్, మహేశ్వర్ సార్, స్కూల్లోని ఇతర టీచర్లు నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలిచారు. ఈ స్కూల్ నా హృదయంలో ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను కలవడం అనేక జ్ఞాపకాలను తిరిగి తెచ్చిపెట్టింది’ అని ప్రధాన్ పేర్కొన్నారు.

ఇంకా ‘మళ్లీ మా స్కూల్‌కి వచ్చినందుకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ఈ రోజు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఐదో తరగతి వరకు నా బాల్యం ఈ పాఠశాలలోనే గడిచింది. చాలా కాలం తర్వాత తిరిగి ఈ స్కూల్‌కి వచ్చి విద్యార్థులను, ఉపాధ్యాయులను కలవడం మంచి అనుభవం. నా ఆనందానికి మరో కారణం ఏమిటంటే.. ఈ పాఠశాలలో చదువుకునే చిన్నారులే రేపు భారత్‌కు నాయకత్వం వహించనున్నారు’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే ‘ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! పాత పాఠశాలకు వెళ్లిన ప్రతిసారీ ఓ ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఈ పాఠశాలలోనే నా బాల్యం గడిపాను. అప్పటి రోజులు చాలా సులభమైనవి, అదంతా ఒక కలలా ఉంది’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ చేశారు.

తాల్చేర్‌లోని హందీదువా ప్రాథమిక పాఠశాలలో నేను నా బాల్యం గడిపాను. ఆ రోజుల్లో జీవితం చాలా సులభం మరియు ఒక కలలా ఉంది!.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..