Viral Video: బండిని లాగలేక లాగలేక లాగుతున్న వృద్ధుడు.. మంచిమనసు చాటుకున్న ఆటోడ్రైవర్.
సొంతలాభం కొంతమానుకు పొరుగు వానికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ. ప్రస్తుత కాలంలో ఇలాంటి సూక్తులకు కాలం చెల్లిపోయిందనే అనిపిస్తోంది. పక్కవాడు ఆపదలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా ముందుకు రారు కొందరు. అలాంటి ఈ రోజుల్లో కూడా కొందరు తమ మంచి మనసును చాటుకుంటున్నారు.
సొంతలాభం కొంతమానుకు పొరుగు వానికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ. ప్రస్తుత కాలంలో ఇలాంటి సూక్తులకు కాలం చెల్లిపోయిందనే అనిపిస్తోంది. పక్కవాడు ఆపదలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా ముందుకు రారు కొందరు. అలాంటి ఈ రోజుల్లో కూడా కొందరు తమ మంచి మనసును చాటుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయగలిగిన సాయం చేస్తున్నారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు తన రిక్షాబండిలో పెద్ద ఎత్తున లోడు వేసుకొని లాక్కెళ్తున్నాడు. అతను ఆ బండిని లాగలేక లాగలేక లాగుడున్నాడు. ఇంతలో అటుగా ఓ ఆటో వచ్చింది. అదికూడా ఓ గూడ్స్ తీసుకెళ్లే ఆటోలాగే ఉంది. అందుకే ఆ రిక్షాలాగే వృద్ధుడి కష్టం అతనికి అర్థమైంది. దాంతో అతనికి తన ఆటో సపోర్ట్ చేసి బండి సులభంగా ముందుకు సాగేందుకు ఆ వృద్ధుడకి సాయం చేశాడు. ఆటోను ఆ బండి వెనక్కి తీసుకెళ్లి ముందు చక్రంతో ఆటోను మెల్లగా నెడుతూ సపోర్ట్ ఇచ్చాడు. దాంతో ఆ వృద్ధుడు రిక్షాబండిని తేలికగా ముందుకు లాక్కెళ్లాడు. ఈ వీడియోను ఓ యూజర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 2 లక్షలమందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు ఆటోడ్రైవర్ మంచి మనసును మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

