AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Video: నంద్యాలలో మహిళలతో నగ్నపూజలు.. అడ్డంగా దొరికిపోయారు.. వీడియో.

Crime Video: నంద్యాలలో మహిళలతో నగ్నపూజలు.. అడ్డంగా దొరికిపోయారు.. వీడియో.

Anil kumar poka
|

Updated on: Jun 24, 2023 | 8:59 PM

Share

ఓవైపు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్నా.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. ఇలా చేస్తే.. ఏదో జరిగిపోతుంది అంటూ నమ్మబలికి అందినకాడికి దండుకునే కంత్రీగాళ్లు ఓవైపు.. అదే అదునుగా చేసుకుని ఆడపిల్లలపై అఘాయిత్యాలకు...

ఓవైపు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్నా.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. ఇలా చేస్తే.. ఏదో జరిగిపోతుంది అంటూ నమ్మబలికి అందినకాడికి దండుకునే కంత్రీగాళ్లు ఓవైపు.. అదే అదునుగా చేసుకుని ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లు మరోవైపు చెలరేగుతూనే ఉన్నాయి.. పూజలతో అద్భుతాలు జరుగుతాయి.. అనారోగ్య సమస్యలు కుదుటపడతాయంటూ కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా నంద్యాలలో అలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాచాగలమర్రి మండలానికి చెందిన ఓ మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన బత్తలూరి లక్ష్మినాగమ్మ, బోయ సాయమ్మ అనే ఇద్దరు వ్యక్తులు బాధిత మహిళ కుటుంబాన్ని కలిసారు. ఆమె భర్త అనారోగ్యానికి కారణం చేతబడి అని చెప్పి, అది తొలగించడానికి ప్రత్యేక పూజలు చేయాలని, చెప్పారు. వారి మాటలు నమ్మిన బాదిత మహిళ వారికి పూజల నిమిత్తం 3 లక్షల రూపాయలు సమర్పించింది. అయినా తన భర్త ఆరోగ్యం కుదుటపడలేదు. దాంతో మాయలేడి చేతబడి బలంగా చేశారు, అందుకే తన పూజలు పనిచేయలేదన,ఇ తనకన్నా పవర్‌ఫుల్‌ స్వామీజీ ఉన్నారు, ఆయన పూజలు చేస్తే తప్పకుండా పూర్తిగా నయమైపోతుందని నమ్మబలికింది. నంద్యాల పక్కన చాబోలు కి చెందిన పోలూరు మహమ్మద్ హుస్సైన్ ని పిలుచుకుని వచ్చి పరిచయం చేసింది. రంగంలోకి దిగిన మహమ్మద్ హుస్సైన్ తన ప్లాన్‌ అమలు చేశాడు. పూజలకు చాలా ఖర్చవుతుందని, వారివద్దనుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేశాడు. పూజల్లో భాగంగా బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులు మరో ముగ్గురిని ఒకరికి తెలియకుండా ఒకరిని పూజల పేరుతో భయపెట్టి నగ్న పూజలు చేయించాడు. బాధిత మహిళ నిలదీయగా ఆమెను బలవంతం చేయబోయాడు. అక్కడినుంచి తప్పించుకుని వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!