Dharmendra Pradhan: వారే నిజమైన హీరోలు.. కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

|

Jan 14, 2023 | 5:37 PM

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

Dharmendra Pradhan: వారే నిజమైన హీరోలు.. కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Follow us on

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పీఎం న్యూట్రిషన్ స్కీమ్ కింద వచ్చిన అన్ని ఫిర్యాదులను స్వీకరించి.. వాటిపై విచారణ చేపడతామని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంచేశారు. ప్రధానమంత్రి పోషణ్ యోజనను ఇంతకుముందు మిడ్ డే మీల్ అని పిలిచేవారు. శనివారం మీడియాతో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కోల్‌కతాలోని బెహలా సర్సునాలోని బీజేపీ కార్యకర్త ఇంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భోజనం చేసి.. ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. బీజేపీ కార్యకర్త వృత్తి రీత్యా డ్రైవర్.. కాగా ఆయన ఇంట్లో ధర్మేంద్ర ప్రధాన్ భోజనం చేసి.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

బీజేపీ కార్యకర్త ఇంట్లో బెంగాలీ భోజనం చేసినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. “శంకర్ కథల్, అతని కుటుంబం ప్రేమ, ఆప్యాయతతో నేను పాత్రుడినయ్యాను.. రుచికరమైన బెంగాలీ భోజనం వడ్డించారు. శంకర్ వృత్తిరీత్యా డ్రైవర్.. తన హృదయంలో బిజెపిని, పార్టీ భావజాలాన్ని అణువణువన కలిగి ఉన్నాడు. ఆయనలాంటి ఆత్మగౌరవం, కష్టపడి పనిచేసే కార్యకర్తలే తమ పార్టీకి నిజమైన హీరోలు’’ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

మమత ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఫైర్..

రాష్ట్రంలో అప్రజాస్వామిక పార్టీ అధికారంలో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి స్థానం లేదు కావున తరచూ దారుణ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నార. విద్యాశాఖ మంత్రి ఇంటి వాళ్లకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక వాతావరణం నెలకొందని.. అవినీతి పెచ్చుమీరందంటూ ప్రధాన్ ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..