Pravasi Gujarati Parv 2022: ప్రధాని మోదీపై దేశానికి విశ్వాసం పెరిగింది.. ప్రవాసీ గుజరాతీ ఫెస్ట్‌లో అమిత్ షా..

|

Oct 15, 2022 | 1:43 PM

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు అత్యంత వైభంగా జరుగనున్న ఈ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Pravasi Gujarati Parv 2022: ప్రధాని మోదీపై దేశానికి విశ్వాసం పెరిగింది.. ప్రవాసీ గుజరాతీ ఫెస్ట్‌లో అమిత్ షా..
Home Minister Amit Shah
Follow us on

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు అత్యంత వైభంగా జరుగనున్న ఈ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశంలోనే నెంబర్ 1 న్యూస్ నెట్‌వర్క్ TV9, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ నార్త్ అమెరికాలో (AIANA) గుజరాతీ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. దేశ శ్రేయస్సులో గుజరాతీలు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. గుజరాతీలను గౌరవించినందుకు టీవీ9కి ధన్యవాదాలు తెలిపారాయన. గ్లోబల్ బెంచ్‌మార్క్‌ ఇన్ గవర్నెన్స్‌పై స్పందిస్తూ.. దేశంలో ఇలాంటి మోడల్‌ను తీసుకువచ్చిన ఘనత గుజరాత్‌ది అని అన్నారు. ఇది దేశానికి స్ఫూర్తినిచ్చి, మార్పును తీసుకువచ్చిందన్నారు.

ప్రధాని మోదీ గుజరాత్‌కు కొత్త దిశానిర్దేశం చేశారు..

నవభారత నిర్మాణంలో గుజరాత్ పెద్దన్న పాత్ర పోషించిందన్నారు కేంద్ర హోంమంత్రి. గుజరాత్‌లో మార్పు తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ.. నాడు ముఖ్యమంత్రిగా చాలా కృషి చేశారని, ఈ విషయం గుజరాతీయులందరికీ తెలుసునని అన్నారు. ఈ సందర్భంగా 1985కి ముందు గుజరాత్‌కి, నేటి గుజరాత్‌కు తేడాను పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పాలనలో గుజరాత్‌లో మౌలిక సౌకర్యాలు ఘననీయంగా పెరిగాయన్నారు. గుజరాత్‌కు కొత్త రూపు ఇచ్చారని కొనియాడారు.

గుజరాత్ అభివృద్ధికి ప్రణాళికలు..

గుజరాత్ అభివృద్ధి ద్వారా నరేంద్ర మోదీ దేశాభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసం నింపారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుటుంబ వాదం, కులవాదం, బుజ్జగింపులు ఈ మూడు పీడలతో పోరాడేందుకు ప్రధాని మోదీ విశేష కృషి చేశారన్నారు. వైబ్రెంట్ గుజరాత్, వనబంధు యోజన, సాగర్ ఖేదో వికాస్ యోజన, రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలను తీసుకువచ్చారని అన్నారు. గుజరాత్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు..

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు ప్రధాని మోదీ తెచ్చారని అమిత్‌ షా పేర్కొన్నారు. గడిచిన 8 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ 5వ స్థానంలో నిలిపారని చెప్పారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు విశేష కృషి చేశారని అన్నారు హోంమంత్రి అమిత్ షా. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, కరెంట్, మంచి నీరు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ యోజన ద్వారా ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు కల్పించారన్నారు. మోదీ నాయకత్వంలో దేశం విజయవంతంగా కరోనాను ఎదుర్కొందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిభావంతులకు ప్రధాని మోదీ ఒక వేదిక కల్పించారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఏటా ప్రవాసీ గుజరాతీ పర్వ్ నిర్వహిస్తున్నారు. అదానీ ప్రెసెంట్స్ ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 పవర్డ్ బై ఎమ్ఈఐఎల్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 3రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గుజరాతీ ప్రముఖులతో పాటు 20కిపైగా దేశాల్లో ఉన్న గుజరాతీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..