ఆసుపత్రుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంపై ఆధారపడిన అనేక కుటుంబాలను, ముఖ్యంగా కష్టపడి పనిచేసే రైతులను దృష్టిలో ఉంచుకుని, సీఎం మాన్ వెంటనే బకాయి ఉన్న రూ.600 కోట్లను చెల్లించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ట్వీట్‌లో పేర్కొన్నారు.
పంజాబ్‌లో ఆయుష్మాన్ భారత్ బకాయిలను తీర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మంచి ఆసుపత్రుల్లో చికిత్స సౌకర్యం కల్పించేందుకు తాము ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంటోనే వీలైనంత త్వరగా ఆసుపత్రుల బకాయిలను చెల్లించాలని సీఎం భగవంత్ మాన్‌ను కోరుతున్నట్లు జేపీ నడ్డా తెలిపారు.
🚨 Quick Release
📲 Read the full Quick Release on the NaMo App: https://t.co/3fvlvQxL6c
BJP President @JPNadda slams CM @BhagwantMann‘s AAP government for failing to settle Ayushman Bharat dues in Punjab!
“Many families, especially our hardworking farmers, rely on this…
— narendramodi_in (@narendramodi_in) September 20, 2024
బకాయిలు చెల్లిస్తే సామాన్య పేద ప్రజలకు వైద్యం అందే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి, పంజాబ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటునర్సింగ్ హోమ్ అసోసియేషన్లు అనేక ఆరోగ్య బీమా పథకాల కింద నగదు రహిత చికిత్సను నిలిపివేశాయి. ఈ పథకాలలో ఆయుష్మాన్ భారత్ యోజన కూడా చేర్చారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించార
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..