Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట.. రూ. 3 లక్షల కోట్లతో..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది. వీరికి లబ్ధి చేకూరేలా ఏకంగా రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, వర్కింగ్ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం హాస్టళ్లను...

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట.. రూ. 3 లక్షల కోట్లతో..
Nirmala Sitharaman
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2024 | 12:35 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది. వీరికి లబ్ధి చేకూరేలా ఏకంగా రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, వర్కింగ్ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం హాస్టళ్లను ఏర్పాటు చేయనుందని మంత్రి తెలిపారు.

ఇక ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్)తో పాటు మధ్యతరగతి వంటి నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ఈ నాలుగు రంగాలపై దృష్టి సారిస్తుందని ఆమె చెప్పారు. ఈ రంగాలకు రానున్న రోజుల్లో రూ. 2 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే దాదాపు 30 లక్షల మంది యువతకు ఒక నెల ప్రావిడెంట్ ఫండ్ సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌ కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అలాగే స్మార్ట్‌ ఫోన్‌ల ధరలు కూడా తగ్గే జాబితాలో ఉన్నాయి. సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గించనున్నారు. వీటితో పాటు మూడు క్యాన్సర్‌ మందులపై జీఎస్టీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గించనున్నారు. ఇక 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీతో పాటు, సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించనున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!