PM kisan Scheme: పీఎం కిసాన్ సాయం పెంపుపై కేంద్ర వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన..

రైతులకు ప్రతి ఏటా పంటకు సరిపడా పెట్టుబడి సాయం కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6 వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంది. అయితే ఈ మొత్తం నిధులను మూడు విడతలుగా రైతులకు అందజేస్తుంది. గత కొంత కాలంగా ఈ నగదు మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు అనేక సార్లు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు.

PM kisan Scheme: పీఎం కిసాన్ సాయం పెంపుపై కేంద్ర వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన..
Pm Kisan

Updated on: Dec 05, 2023 | 7:32 PM

రైతులకు ప్రతి ఏటా పంటకు సరిపడా పెట్టుబడి సాయం కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6 వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ మొత్తం నిధులను మూడు విడతలుగా రైతులకు అందజేస్తుంది. గత కొంత కాలంగా ఈ నగదు మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు అనేక సార్లు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ శీతాకాల సమావేశాల సాక్షిగా ఒక ప్రకటన చేశారు. ఇప్పటికైతే పీఎం కిసాన్ మొత్తాన్ని రూ. 6 వేల నుంచి పెంచే ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు.

2018 నుంచి దేశ వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 కేంద్రం పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ నగదును నేరుగా తమ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు 15 విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నామ్నారు. దీని కోసం రూ. 2.81 లక్షల కోట్లు పంపిణీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటిగా వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..