AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaipur: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ను కాల్చిచంపిన దుండగులు..

జైపూర్‌ లోని శాంతినగర్‌ ప్రాంతంలో సుఖ్‌దేవ్‌ను రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండుగులు కాల్చి చంపారు. కాల్పుల్లో సుఖ్‌దేవ్‌ బాడీగార్డ్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సుఖ్‌దేవ్‌ నివాసానికినికి పోలీసులు చేరుకున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

Jaipur: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ను కాల్చిచంపిన దుండగులు..
Karni Sena Sukhdev Singh
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2023 | 8:46 PM

Share

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో రాష్ట్రీయ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ను దుండగులు కాల్చిచంపడం తీవ్ర కలకలం రేపింది. జైపూర్‌ లోని శాంతినగర్‌ ప్రాంతంలో సుఖ్‌దేవ్‌ను రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండుగులు కాల్చి చంపారు. కాల్పుల్లో సుఖ్‌దేవ్‌ బాడీగార్డ్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సుఖ్‌దేవ్‌ నివాసానికినికి పోలీసులు చేరుకున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. సుఖ్‌దేవ్‌పై కాల్పులు జరిపిన గ్యాంగ్‌స్టర్‌ నవీన్‌ షెకావత్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. నలుగురు దుండగులు సుఖ్‌దేవ్‌సింగ్‌ అతిసమీపం నుంచి కాల్చి చంపారని తెలుస్తోంది. ఈ మర్డర్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సోఫాలో కూర్చున్న సుఖ్‌దేవ్‌ తో మాట్లాడుతున్నట్టు నటించి కాల్పులు జరిపారు.

హంతకులను పట్టుకునే వరకు సుఖ్‌దేవ్‌ అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదని కర్ణిసేన ప్రకటించింది. ఈ మర్డర్‌ రాజస్థాన్‌ లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు సుఖ్‌దేవ్‌సింగ్‌ను కాల్చిచంపింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించుకుంది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నాడు.

సుఖ్‌దేవ్‌ హత్యను నిరసిస్తూ జైపూర్‌లో కర్నిసేన సభ్యులు, సుఖ్‌దేవ సింగ్‌ అనుచరులు నిరసనకు దిగారు. రోడ్లపై రాకపోకలను అడ్డుకుంటూ నినాదాలు చేశారు. కర్నిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌కు తగినంత భద్రత కల్పించనందువల్లే దుండగులు ఆయన్ను చంపేశారని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ ఆరోపించారు. తన ప్రాణాలకు హాని ఉందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాజస్థాన్లో తమ ప్రభుత్వం కొలువుదీరగానే, ఈ హత్యలో ప్రమేయం ఉన్న దుండగులను విడిచిపెట్టేదే లేదని కేంద్రమంత్రి షెఖావత్‌ భరోసా ఇచ్చారు. జైపూర్‌లో కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ను కాల్చిచంపండం తీవ్ర కలకలం రేపింది. అయితే కాల్పులు జరిపిన వారిలో ఒకరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సుఖ్‌దేవ్‌ హత్యకు నిరసనగా రాజస్థాన్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. గ్రాఫిక్‌

No.1 న్యూస్‌ నెట్‌వర్క్‌.. No.1 ఎలక్షన్‌ కవరేజ్‌.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..