Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావాలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..

| Edited By: Anil kumar poka

Sep 14, 2021 | 2:16 PM

Maharastra Young Man Letter to MLA: తమ ప్రాంత ఎమ్మెల్యేకు, అధికారులకు ఇప్పటివరకూ తనకు ఉద్యోగం కావాలనో... తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదనో.. రోడ్లు వేయమనో.. లేక ఇతర సదుపాయాలు కల్పించమనో..

Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావాలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..
Viral Letter
Follow us on

Maharastra Young Man Letter to MLA: తమ ప్రాంత ఎమ్మెల్యేకు, అధికారులకు ఇప్పటి వరకూ తనకు ఉద్యోగం కావాలనో… తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదనో.. రోడ్లు వేయమనో.. లేక ఇతర సదుపాయాలు కల్పించమనో అభ్యర్థిస్తూ లెటర్ రాస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోంచాడు..  తనను ఏ అమ్మాయి చూడడంలేదని..ఏ అమ్మాయి పడడం లేదు  కనుక ఓ గర్ల్ ప్రెండ్ ను చూసి పెట్టండి మహాప్రభో అంటూ ఓ ఎమ్మెల్యేకు లెటర్ రాశాడు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ రేంజ్ లో తన కోరికను ఎమ్మెల్యేకు వినిపించిన ఆ యువకుడు మహారాష్ట్రకు చెందినవాడు. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని చంద్రపూర్ భూషణ్ జామువంత్ అనే యువకుడు తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని.. ఓ అమ్మాయిని చూసి పెట్టండి అని కోరుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు ఓ లెటర్ రాశాడు. ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. నేను వారి లవ్ చేయడానికి చాలా ట్రై చేశా.. నాకు ఏ అమ్మాయి పడడం లేదు..   ఏ అమ్మాయి ఇష్టపడడం లేదు..  అసలు ఎవరూ నా వైపు చూడడం లేదు. దీంతో నాకు ఏమి తక్కువ.. ఎందుకు అమ్మాయిలు నన్ను చూడడం లేదు.. నాకు పాడడం లేదు అనే ఆలోచన అధికమవుతుంది. దీంతో నాకు రోజు రోజుకీ ఆందోళన పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే నా మీద నాకే నమ్మకం తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసాన్ని  కోల్పోతున్నా అందుకనే మీ సాయం ఆడుతున్నా అంటూ తన ఆవేదనను మరాఠీ భాషలో వ్యక్తం చేశాడు.

ఇంకా ఆ ఉత్తరంలో తన క్వాలిఫికేషన్ ను తెలియజేస్తూ.. రోజూ అల్లరిచిల్లరగా తిరుగుతూ.. మద్యం తాగుతూ.. సంపాదన లేనివారికి కూడా లవర్స్ ఉంటున్నారు. మరి నాకు ఏమి తక్కువో నాకు అర్ధం కావడం లేదు.. ఎందుకు ఏ అమ్మాయి నన్ను ఇష్ట పడడంలేదు ఎంత ఆలోచించినా తెలియడం లేదు..అల్లరిచిల్లరిగా తిరిగే కురాళ్లకు గర్ల్స్ ఫ్రెండ్స్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటె.. వారిని చూస్తే నాకు మరింత బాధకలుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే ఈ ఉత్తరంపై ఎమ్మెల్య్ సుభాష్ స్పందించారు. తనకు ఇప్పటివరకూ ఇలాంటి వినతితో కూడిన లెటర్ రాలేదని.. చాలా గమ్మత్తుగా ఉందని అన్నారు.  అంతేకాదు.. తనకు లెటర్ రాసిన యువకుడు గురించి ఆరాతీయడానికి కార్యకార్తలను రంగంలోకి దింపారు. ఆ యువకుడు కనిపిస్తే ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతేకాని.. గర్ల్ ప్రెండ్ దొరకడం లేదు అంటూ అర్ధం లేని ఆవేదన  ఆరోగ్యానికి హానికరం అంటూ కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.  ఇక ఇలాంటి అర్ధంలేని కోరికలతో ఉత్తరాలు రాయడం కరెక్ట్ కాదని అన్నారు. మరి కార్యకర్తలు భూషణ్ జామువంత్ ని కనుగొని ఎమ్మెల్యే వద్దకు తీసుకుని వెళ్తారో లేదో చూడాలి మరి .

Also Read: .IIT Recruitment 2021: హైదరాబాద్ ఐఐటిలో 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 2,08,700 వరకు వేతనం..