IIT Recruitment 2021: హైదరాబాద్ ఐఐటిలో 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 2,08,700 వరకు వేతనం..

IIT Recruitment 2021: హైదరాబాద్ వేదికగా ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిప్లమో ,  బీఎస్సీ , ఐటిఐ ఉత్తీర్ణతైన నిరుద్యోగులకు మంచి జీతంతో  చక్కటి ఉద్యోగావకాశాలకు..

IIT Recruitment 2021: హైదరాబాద్ ఐఐటిలో 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 2,08,700 వరకు వేతనం..
Iit Recruitment
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2021 | 12:49 PM

IIT Recruitment 2021: హైదరాబాద్ వేదికగా ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిప్లమో ,  బీఎస్సీ , ఐటిఐ ఉత్తీర్ణతైన నిరుద్యోగులకు మంచి జీతంతో  చక్కటి ఉద్యోగావకాశాలకు ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత,  ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవచ్చు.  మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులపై ఆసక్తిగలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఏ కేటగిరికి చెందిన అభ్యర్థులైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఉద్యోగం  పూర్తి వివరాలు: 

జాబ్ రోల్: ఎగ్జిక్యూటిక్‌ ఇంజినీర్‌,  జూనియర్ మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, మల్టీ స్కిల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్ తదితర పోస్టులు మొత్తం ఖాళీలు : 24 విద్యార్హత : దరఖాస్తు చేసుకునే సంబంధిత పోస్టులను అనుసరించి ఆయా సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ / బీటెక్‌ / ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ / ఎంటెక్, ఎంబీబీఎస్‌ , ఐటీఐ పాస్ అయిఉండాలి. అంతేకాదు పోస్టులను బట్టి సంబంధిత శాఖ లో ఎక్స్ పీరియన్స్  ఉండాలి.

వయస్సు : పోస్టును అనుసరించి కొన్ని ఉద్యోగాలకు 30 ఏళ్లు, మరికొన్ని ఉద్యోగాలకు 45 ఏళ్లు గరిష్ట పరిమితి వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,500 – 2,70,000 /- ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 13, 2021 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021

అప్లికేషన్ చేసుకోవడానికి పూర్తి వివరాల కోసం ఈ  లింక్‌ని క్లిక్ చేయండి

Also Read: Jabardasth: చదువుతో సంబంధం లేకుండా ప్రతిభతో లక్షల్లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా.

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!