UGC NET 2023 Exam Dates: యూజీసీ నెట్ జూన్-2023 పరీక్ష తేదీ విడుదల.. త్వరలో హాల్ టికెట్లు

|

Jun 08, 2023 | 3:40 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు జేఆర్‌ఎఫ్‌ కమ్‌ నెట్‌ అర్హతకు నిర్వహించే ఫేజ్‌-1కు సంబంధించిన పరీక్ష తేదీలను..

UGC NET 2023 Exam Dates: యూజీసీ నెట్ జూన్-2023 పరీక్ష తేదీ విడుదల.. త్వరలో హాల్ టికెట్లు
UGC NET 2023 Exam Date
Follow us on

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు జేఆర్‌ఎఫ్‌ కమ్‌ నెట్‌ అర్హతకు నిర్వహించే ఫేజ్‌-1కు సంబంధించిన పరీక్ష తేదీలను ఎన్టీఏ తాజాగా వెల్లడించింది. యూజీసీ నెట్‌ ఫేజ్‌-1 పరీక్షలు జూన్‌ 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెల్పింది. ఆయా తేదీల్లో సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి.

కాగా ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ వంటి దాదాపు 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.