Udaipur Tailor Murder: రాజస్థాన్‌లో హైఅలర్ట్.. నెలరోజులపాటు 144 సెక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ

|

Jun 29, 2022 | 9:25 AM

రాజస్థాన్‌‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో గెహ్లాట్ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

Udaipur Tailor Murder: రాజస్థాన్‌లో హైఅలర్ట్.. నెలరోజులపాటు 144 సెక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ
Udaipur Tailor Murder
Follow us on

Udaipur Tailor Kanhaiya Lal Killed: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను దారుణంగా హత్యచేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. టైలర్ కన్హయ్య లాల్‌ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో గెహ్లాట్ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. రాజస్థాన్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు కన్హయ్య లాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసును దర్యాప్తు చేయడానికి SOG ADG అశోక్ కుమార్ రాథోడ్, ATS IG ప్రఫుల్ల కుమార్, ఇద్దరు SPలతో SIT ఏర్పాటు చేసింది.

కాగా.. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తమైంది. టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంగళవారం ఉదయ్‌పూర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల బృందాన్ని పంపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసును కేంద్ర ఉగ్రవాద దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ప్రాథమికంగా చూస్తే ఈ హత్య ఉగ్రదాడిలా కనిపిస్తోందని ఓ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.

నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడన్న కారణంతో టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తూ ర్యాలీ తీశారు. టైలర్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్‌ చేశారు. ఇద్దరు హంతకులు మర్డర్‌ తరువాత వీడియో కూడా రిలీజ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..