Type-2 Dengue Cases: బీఅలర్ట్.. పెరుగుతున్న టైప్-2 డెంగ్యూ కేసులు.. కేవలం 4 రోజుల్లోనే ఐదుగురు మృతి..

|

Jul 06, 2023 | 9:36 AM

Type-2 Dengue Cases: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందలాది టైప్ 2 డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Type-2 Dengue Cases: బీఅలర్ట్.. పెరుగుతున్న టైప్-2 డెంగ్యూ కేసులు.. కేవలం 4 రోజుల్లోనే ఐదుగురు మృతి..
Dengue Cases
Follow us on

Type-2 Dengue Cases: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందలాది టైప్ 2 డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లోనే 5 మరణాలు, 309 కి పైగా టైప్ 2 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతకుముందు నెలలో 23 మంది జ్వరం కారణంగా మరణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఆరోగ్య శాఖ ప్రకారం.. 10 మరణాలు మాత్రమే ఇప్పటివరకు నమోదు చేశారు. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. టైప్ 2 డెంగ్యూ కేసులు పేరుతున్న నేపథ్యంలో కొల్లం, కోజికోడ్ జిల్లాలను డెంగ్యూ హాట్‌స్పాట్‌లుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. టైప్ 2 డెంగ్యూ ఫీవర్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశామని తెలిపారు.

అయితే, కేరళలో ఈ ఏడాది జనవరి నుండి రాష్ట్రంలో 3,409 కేసులు నమోదు కాగా.. 10,038 అనుమానిత కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూనే కాకుండా ర్యాట్ ఫీవర్, స్క్రబ్ టైఫస్ వంటి సీజనల్ జ్వరాలు, వ్యాధులు కూడా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది.

గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ 138 డెంగ్యూ హాట్‌స్పాట్‌లను గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ జ్వరం..

ఏడెస్ జాతి దోమ కాటు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి డెంగ్యూ.. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. కానీ ఇది తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీయవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..