ఒడిశా రాష్ట్రంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రాజధాని భువనేశ్వర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. రైల్వేశాఖ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. భువనేశ్వర్ సమీపంలోని మంచేశ్వర్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Odisha | Two wagons of a goods train derail near Bhubaneswar railway station; restoration work underway pic.twitter.com/ZDdNjUDE6l
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 26, 2024
గూడ్స్ రైలు కావటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…