Train Accident: రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీః.. భారీ శబ్ధం..!
Train Accident: ఈ మధ్య కాలంలో రైళ్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు..
Train Accident: ఈ మధ్య కాలంలో రైళ్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దాదర్, మటుంగాల మధ్య ఒకే ట్రాక్‌పై ఛేంజింగ్ సమయంలో గదగ్ ఎక్స్‌ప్రెస్ (Gadag Express)-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (Puducherry Express)లు రెండు రైళ్లు వచ్చాయి. దీంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన దాదర్-మటుంగా రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. అయితే ఒకే ట్రాక్‌పై రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ శబ్ధం వచ్చింది. ప్రమాదం సమయంలో రెండు రైళ్లు కూడా వేగంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా మూడు బోగిలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
రెండు రైళ్లు వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో ఏం జరిగింతో తెలియక టెన్షన్‌కు గురయ్యారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లపై నిప్పు రవ్వలు చెలరేగడంతో ఈ భారీ శబ్ధం వచ్చింది. ప్రమాదంలో లైను దెబ్బతినడంతో చాలా మంది ప్రయాణికులు దిగి స్టేషన్‌కు నచుకుంటూ వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: