Viral: అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..! కాఫీ మేకింగ్ మిషన్‌ను ఇలా కూడా వాడొచ్చా..

అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. స్మగ్లర్లు రోజుకొక ఐడియాలతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ.. కస్టమ్స్ అధికారులు మాత్రం వారికి చెక్ పెట్టి మరి కటకటాల వెనక్కి నెడుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం అధికారులు విదేశాల నుంచి..

Viral: అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..! కాఫీ మేకింగ్ మిషన్‌ను ఇలా కూడా వాడొచ్చా..
Coffee Machine
Follow us
Shaik Madar Saheb

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 02, 2024 | 11:26 AM

అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. స్మగ్లర్లు రోజుకొక ఐడియాలతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ.. కస్టమ్స్ అధికారులు మాత్రం వారికి చెక్ పెట్టి మరి కటకటాల వెనక్కి నెడుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం అధికారులు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. విమానాశ్రయ అధికారుల ప్రకారం.. 2023లో ఇది అతిపెద్ద అక్రమ రవాణా అంటూ తెలిపారు. విమానాశ్రయంలో వేర్వేరుగా పట్టుబడిన వ్యక్తులు భారీ ఎత్తున స్మగ్లింగ్ కు పాల్పడుతూ చిక్కారని పేర్కొన్నారు.

ఈ మేరకు విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు X (ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో తెలిపారు. మొదటి సంఘటనలో, కస్టమ్స్ అధికారులు కాఫీ యంత్రంలో బంగారాన్ని కనుగొన్నారు. ప్రయాణీకుడు దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చాడని.. అనుమానం వచ్చి చెక్ చేయడంతో అసలు విషయ బయటపడిందని పేర్కొన్నారు. కాఫీ మిషన్‌లో 3.494 కిలోల బంగారాన్ని దాచి తీసుకొచ్చాడని.. దీని మొత్తం విలువ సుమారు రూ.2 కోట్లు ($264,508) ఉంటుందని తెలిపారు. కస్టమ్స్ అధికారులు సుత్తిని ఉపయోగించి కాఫీ యంత్రాన్ని పగలగొట్టి రెండు స్థూపాకార బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వీడియో చూడండి..

రెండవ కేసులో షార్జా నుంచి ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి పురీషనాళంలో పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్నో ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రరకారం.. పురీషనాళంలో పేస్ట్ రూపంలో దాచిన 554 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.0.35 కోట్ల ($42080) విలువ ఉంటుందని తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లి బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..