Cheetah cub: మరో 2 చీతా కూనలు మృతి.. ఈ వారంతో మొత్తం 3.. డీహైడ్రేషన్‌ కారణంగానే

కునో నేషనల్ పార్క్‌లో రెండు రోజుల్లో మూడు కూనో చీతా కూనలు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. అధిక ఉష్ణోగ్రతలే చీతా పిల్లల మృతికి కారణమన్న అధికారుల వాదనపై మండిపడుతున్నారు జంతుప్రేమికులు.

Cheetah cub: మరో 2 చీతా కూనలు మృతి.. ఈ వారంతో మొత్తం 3.. డీహైడ్రేషన్‌ కారణంగానే
Cheetah Cub (Representational photo)

Updated on: May 25, 2023 | 8:44 PM

మధ్యప్రదేశ్‌ లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మరణమృదంగం కొనసాగుతోంది. రెండు రోజుల్లో మూడు చీతా కూనలు చనిపోవడం జంతుప్రేమికులను షాక్‌కు గురిచేసింది. బుధవారం ఓ చీతా కూన చనిపోగా తాజాగా రెండు కూనలు చనిపోయాయి. ఇంకో చీతా కూన పరిస్థితి విషమంగా ఉంది. నమీబియా వైద్యుల పర్యవేక్షణలో ఆ చీతా కూనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకే చీతా కూనలు చనిపోయినట్టు తెలుస్తోంది. అంతకుముందు కునో నేషనల్‌ పార్క్‌లో రెండు నెలల్లో నాలుగు చీతాలు చనిపోవడం కలకలం రేపింది. నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు చనిపోయాయి. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కేంద్రం 20 చీతాలను తీసుకొచ్చింది.

విదేశాల నుంచి తీసుకువచ్చిన చీతాలకు ఏమైంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకదానికి జ్వాల అని పేరు పెట్టారు. ఈ జ్వాలాకు ఈ మార్చి నెలలో నాలుగు చీతా కూనలు జన్మించాయి. మంగళవారం తల్లితోపాటు మూడు పిల్లలు అటవీ ప్రాంతంలో తిరిగినట్లు పార్క్ సిబ్బంది తెలిపారు. కాని బుధవారం కూన , ఇవాళ మరో రెండు కూనలు చనిపోవడం కలకలం రేపింది.

గతంలోనూ విదేశాల నుంచి తీసుకువచ్చిన చీతాలు.. కునో జాతీయ పార్కులో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష.. రెండు వారాల క్రితం చనిపోయింది. అంతకుముందు నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న చనిపోయింది. ఏప్రిల్‌ 23న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే మగ చీతా మృతి చెందింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం