Venkaiah Naidu Twitter: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ఖాతాకున్న బ్లూ టిక్‌ను శనివారం ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయమంపై పెద్ద దుమారమే లేపింది. ట్విట్టర్ దురుద్దేశంతోనే ఈ పని చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం… ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దీంతో స్పందించిన ట్విట్టర్.. వెంకయ్య ట్విట్టర్ అకౌంట్ చాలా రోజులుగా క్రీయాశీలకంగా లేదని ఈ కారణంతోనే బ్లూటిక్ తొలగించినట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం.. `వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక… తన సమాచారం అంతా… అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ`… తెలిపింది.
దీంతో తప్పును గుర్తించిన ట్విట్టర్ యాజమాన్యం వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూటిక్ తిరిగి ఇచ్చింది. ఇదిలా ఉంటే వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి… చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ట్వీట్ రాలేదు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ తప్పు సరిదిద్దుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
Twitter restores blue verified badge on Vice President of India M Venkaiah Naidu’s personal Twitter handle. pic.twitter.com/teAFmg4iVz
— ANI (@ANI) June 5, 2021
వెనక్కి తగ్గిన ట్విట్టర్…వెంకయ్య నాయుడి ఖాతాకు మళ్లీ బ్లూ టిక్..watch Video
Karnataka: మహిళా ఐఏఎస్‌ల మధ్య విబేధాలు.. రాజీనామా వరకు వెళ్లిన వ్యవహారం.. స్పందించిన సీఎం