రైతుల నిరసనలపై రెచ్ఛగొట్టే పోస్టులు, 250 అకౌంట్లను క్లోజ్ చేసిన ట్విటర్
రైతుల నిరసనలపై రెచ్ఛగొట్టే పోస్టులు, కామెంట్లు పెట్టిన వారి ఖాతాలను ట్విటర్ క్లోజ్ చేసింది.ఇవి సుమారు 250 వరకు ఉన్నాయి.
రైతుల నిరసనలపై రెచ్ఛగొట్టే పోస్టులు, కామెంట్లు పెట్టిన వారి ఖాతాలను ట్విటర్ క్లోజ్ చేసింది.ఇవి సుమారు 250 వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఘర్షణలు, అల్లర్లను మరీ అదేపనిగా పదేపదే చూపుతూ కొంతమంది వ్యక్తులు, సంస్థలు మేగజైన్లు కూడా ఈ విధమైన పోస్టులు పెట్టినట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ శాఖ ఆదేశాలపై ట్విటర్ వెంటనే వీటిని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు ఓ ప్రముఖ మేగజైన్, సీపీఎం కు చెందిన మహమ్మద్ సలీమ్ అనే నేత, కిసాన్ ఏక్తా మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ కి చెందిన ఏక్తా ఉర్గహాన్, ఆప్ ఎమ్మెల్యే ఒకరు ఈ విధమైన పోస్టులను పెట్టినట్టు గుర్తించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున రెడ్ ఫోర్ట్ వద్ద ఢిల్లీ పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలను వీరు, ఈ సంస్థలు హైలైట్ చేస్తూ పరిస్థితిని మరింత రాజుకునేట్టు చేశాయని హోం శాఖ భావించింది.
ఇప్పటికే ట్విటర్ సహా ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. రెచ్చ గొట్టే కంటెంట్ ఉందని భావించిన పక్షంలో దాన్ని నిలిపివేయాలని వాటిలో కోరింది. రెడ్ ఫోర్ట్ వద్ద ఓ పోలీసుపై రైతు ఒకరు పొడవాటి కత్తి ఎత్తి దాడికి దిగిన ఫోటోలను విస్తృతంగా పోస్ట్ చేశారు. దీనివల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుందని హోం శాఖ అభిప్రాయపడింది.