National: మీడియా ఇండస్ట్రీకి చేస్తున్న సేవకుగాను.. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌ను వరించిన గౌరవ డాక్టరేట్‌..

|

Apr 27, 2023 | 7:26 PM

ప్రముఖ విద్యాసంస్థ మానవ్‌ రచన ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం నోయిడాలో జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 1500 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరితో పాటు మొత్తం 91 మంది పీహెచ్‌డీ స్కాలర్‌లకు డాక్టరేట్ అందించారు. అలాగే పలు రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న...

National: మీడియా ఇండస్ట్రీకి చేస్తున్న సేవకుగాను.. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌ను వరించిన గౌరవ డాక్టరేట్‌..
Barun Das Receiving The honour
Follow us on

ప్రముఖ విద్యాసంస్థ మానవ్‌ రచన ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం నోయిడాలో జరిగాయి. ఈ స్నాతకోత్సవాన్ని మానవ్‌ రచన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రీసర్చ్‌ అండ్‌ స్టడీస్‌ (MRIIRS), మానవ్‌ రచన డెంటల్‌ కాలేజ్‌ (MRDC), మానవ్‌ రచన యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.  ఈ కార్యక్రమంలో భాగంగా 1500 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరితో పాటు మొత్తం 91 మంది పీహెచ్‌డీ స్కాలర్‌లకు డాక్టరేట్ అందించారు. అలాగే పలు రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న అసాధారణమైన ప్రతిభావంతులపైన 10 మందికి ప్రతిష్టాత్మకమైన హోనోరిస్‌ కాసా డిగ్రీని సైతం ప్రదానం చేశారు. ఈ డాక్టరేట్ అందుకున్న వారిలో టీవీ9 నెట్‌ వర్క్‌, ఎండీ అండ్‌ సీఈఓ బరున్‌ దాస్‌తో పాటు సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునాత్‌ అనంత్‌ మషేలక్కర్‌, ఢిల్లీ యూనివర్సిటీ వీసీ యోగేష్‌ సింగ్‌, మారుతి సుజికీ చీఫ్‌ మెంటర్‌ సకులైన్ యాసిన్ సిద్ధిఖ్, అలెన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ నవీన్‌ మహేశ్వరీ, యాక్సిస్‌ బ్యాంక్‌ ఈవీపీ అండ్ హెడ్‌ రాజ్‌కమాల్‌ వెంపటితో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.

మీడియా ఇండస్ట్రీతో పాటు విద్యా వ్యాప్తికి చేసిన సేవలకు గాను టీవీ9 ఎండీ అండ్‌ సీఈఓ బరున్‌దాస్‌కు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. బరున్‌ దాస్‌ ఈ కార్యక్రమానికి ఆయన భార్య డాక్టర్‌ సందీప భట్టాచార్యతో కలిసి హాజరయ్యారు. డాక్టరేట్‌ అందుకున్న తర్వాత బరున్‌ దాస్‌ యూనివర్సిటీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌ ప్రపంచ స్థాయికి ఎదుగుతోన్న అద్భుతమైన సమయంలో మనందరం ఉన్నామని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభ సమయంలో భారత దేశమే ఆశాజనకంగా కనిపిస్తుందని ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచ బ్యాంకుతో పాటు మరెన్నో సంస్థలు చెబుతున్నాయి. జీ20 సమావేశాలకు మనం ఆదిత్యమివ్వడం దీనికి మరో సంకేతమం’ అని చెప్పుకొచ్చారు.

Barun Das Receiving The honour

ఇక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన బరున్‌ దాస్‌.. ‘ఇలాంటి గౌరవప్రదమైన సంస్థ నుంచి విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించడం సంతోషం. విద్యార్థులంతా వారి వృత్తి జీవితాల్లో విజయాన్న అందుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆసక్తులు, దృష్టి కోణం మారుతున్నాయి. ప్రస్తుతం చేతి వేళ్లపై సమాచారం లభిస్తోంది. ఇలాంటి తరుణంలో మనంతా మరెంతో స్పృహతో ఉండాలి’ అని బరున్‌ దాస్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

Barun Das Speech

Barun Das with wife Dr. Sandipa Bhattacharya

ఇక మానవ్‌ రచన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ స్టడీస్‌ విద్యా సంస్థ విషయానికొస్తే.. ఇది యూజీసీ సెక్షన్‌ 3 యాక్ట్‌, 1956 చెందిన సంస్థ. నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకత. టీచింగ్‌తో పాటు సౌకర్యాలలో రచన యూనివర్సిటీ 5 స్టార్‌ రేటింగ్ దక్కించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..