AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టర్కీ లేకపోతే ఇండియా.. బ్రిటిష్ వారికి బానిస అయ్యేది కాదు..! పచ్చి నిజాలు..

1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తో ఒట్టోమన్ సామ్రాజ్యం ఏర్పడింది. ఇది యూరోప్, ఆసియా మధ్య వాణిజ్య మార్గాలను మూసివేసింది. దీంతో యూరోపియన్ దేశాలు కొత్త వాణిజ్య మార్గాల కోసం గాలించాయి. కొలంబస్ అమెరికాను కనుగొనడానికి ఇదే కారణం. ఈ సంఘటన భారతదేశంపై బ్రిటిష్ వారి ఆధిపత్యానికి దారితీసింది. తుర్కియే చరిత్ర ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను ప్రభావితం చేసింది.

టర్కీ లేకపోతే ఇండియా.. బ్రిటిష్ వారికి బానిస అయ్యేది కాదు..! పచ్చి నిజాలు..
Turkey And India
SN Pasha
|

Updated on: May 15, 2025 | 5:56 PM

Share

టర్కీ(తుర్కియే).. ఇండియాలో వ్యతిరేకత మూటగట్టుకున్న దేశం. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియే పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం, పాకిస్తాన్‌కు ఆయుధాలను సరఫరా చేయడమే దీనికి కారణం. ఆ విషయం పక్కనపెడితే.. అసలు టర్కీ లేకుంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించి ఉండేవారు కాదని మీకు తెలుసా? ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలను మార్చడంలో టర్కీ ప్రధాన పాత్ర పోషించింది. టర్కీ ప్రపంచాన్ని మార్చిన ఈ కథ దాదాపు 600 సంవత్సరాల నాటిది. 1453 సంవత్సరంలో నేటి ఇస్తాంబుల్(టర్కీ రాజధాని) ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. అంతకు ముందు ఆసియా, యూరప్ ఖండాల మధ్య వ్యాపించిన ఈ నగరాన్ని కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు. దీనిని రోమన్ సామ్రాజ్యం 1500 సంవత్సరాలు పరిపాలించింది. అధికార మార్పుతో మొత్తం ప్రపంచం ఆర్థిక, రాజకీయ ధోరణి మారిపోయింది.

వాణిజ్యం ఆగిపోయింది..

కాన్స్టాంటినోపుల్ సింహాసనంపై కూర్చున్న కొత్త సామ్రాజ్యం చేసిన మొదటి పని యూరప్, ఆసియా మధ్య వాణిజ్యం జరిగే భూ మార్గాన్ని మూసివేయడం. ఆ సమయంలో ఐరోపాలో భారతీయ సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా నల్ల మిరియాలు, వస్త్రాలు, ముఖ్యంగా మస్లిన్ (ఢాకా మస్లిన్) కు చాలా డిమాండ్ ఉండేది. వీటిని అక్కడ విలాస వస్తువులుగా అమ్మేవారు. కాన్స్టాంటినోపుల్‌కు వెళ్లే మార్గం మూసివేయడంతో ఈ వస్తువుల వ్యాపారం ఆగిపోయింది. అదే సమయంలో చైనా సిల్క్ రూట్ ద్వారా వాణిజ్యం కూడా ప్రభావితమైంది. ఈ ఒక్క సంఘటన తర్వాత యూరప్‌లో కొత్త వాణిజ్య మార్గాలను కనుగొనే పోటీ మొదలైంది. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్ వంటి దేశాల నుండి చాలా మంది నావికులు తమ నౌకాదళాలతో భారతదేశానికి చేరుకోవడానికి సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. క్రిస్టోఫర్ కొలంబస్ కూడా భారతదేశానికి మార్గం వెతుక్కుంటూ బయలుదేరి అనుకోకుండా అమెరికా చేరుకున్నాడు. 1492 లో అమెరికా ఈ విధంగా కనుగొనబడింది. అయితే వాస్కో డి గామా పోర్చుగల్ నుండి వచ్చి ఆఫ్రికా తీరం వెంబడి సముద్రం ద్వారా ప్రయాణించి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ దాటి భారతదేశంలోని కాలికట్ చేరుకున్నాడు.

వాస్కో డి గామా కనుగొన్న మార్గం చాలా సురక్షితమైనది. దీని తరువాత దాదాపు 100 సంవత్సరాల పాటు పోర్చుగీస్, డచ్ వారు భారతదేశం నుండి యూరప్‌కు బట్టలు, సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం ద్వారా అతను చాలా డబ్బు సంపాదించారు. భారతదేశంపై కూడా బంగారు వర్షం కురిసింది. నల్ల మిరియాలు, మస్లిన్ వంటి వస్తువులకు ఐరోపాలో డిమాండ్ పెరుగుతూనే ఉంది, అయితే భారతదేశం నుండి ఈ వస్తువులను తీసుకురావడంలో పోర్చుగీసు వారికి గుత్తాధిపత్యం ఉంది. ఆ సమయంలో బంగారం, వెండి నాణేలు కరెన్సీగా చెలామణిలో ఉండేవి. భారతీయులు మిరియాలు, మస్లిన్ వంటి దుస్తులకు బదులుగా యూరప్ నుండి చాలా బంగారాన్ని పొందారు. ఈ విధంగా భారతదేశంలో బంగారు నిల్వలు భారీగా పెరిగాయి.

బ్రిటిష్ వారికి బానిసగా..

దాదాపు 100 సంవత్సరాల తరువాత 1600వ సంవత్సరంలో బ్రిటిష్ వారు భారత్‌కు వచ్చారు. ఆ తరువాత ఫ్రెంచ్, డానిష్ ప్రజలు కూడా ఈ వ్యాపారం నుండి లాభాలు సంపాదించడానికి భారతదేశానికి వచ్చారు. భారతదేశ వాణిజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ దేశాలన్నింటి మధ్య అనేక యుద్ధాలు కూడా జరిగాయి. బ్రిటిష్ వారు తమ తుపాకుల సహాయంతో చాలా చోట్ల గెలిచారు. ఈ చరిత్రలో ప్రధాన ఘట్టం 1757 నాటి ‘ప్లాసీ యుద్ధం’. బెంగాల్ గడ్డపై జరిగిన ఈ యుద్ధం బ్రిటిష్ వారికి భారతదేశంలో తమ పట్టును స్థాపించుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు, 1764లో జరిగిన బక్సర్ యుద్ధం భారతదేశ చరిత్రను మార్చివేసింది, క్రమంగా దేశం బ్రిటిష్ వారికి బానిసగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..