AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జమ్ముకశ్మీర్‌లో నక్కి నక్కి చూస్తున్న ఉగ్రవాదులు… ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం

జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదరు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. అవంతిపొరాలో గురువారం ఉదయం భద్రతా దళాలకు.. టెర్రరిస్టులకు...

Viral Video: జమ్ముకశ్మీర్‌లో నక్కి నక్కి చూస్తున్న ఉగ్రవాదులు... ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం
Terrorists Holed Up
K Sammaiah
|

Updated on: May 15, 2025 | 5:00 PM

Share

జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదరు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. అవంతిపొరాలో గురువారం ఉదయం భద్రతా దళాలకు.. టెర్రరిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు టెర్రరిస్టులు నక్కి నక్కి దాక్కున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా ఉపజిల్లా అవంతిపొరాలోని ట్రాల్‌ పరిధిలో నాదర్ గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతా దళాలు కూడా ఎదరు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మృతులు ఆసిఫ్‌ అహ్మద్ షేక్‌, అమీర్‌ ‌ నజీర్‌ వని, యావర్‌ అహ్మద్ భట్‌గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్‌ ప్రాంతంలోని జిన్‌పాథర్‌ కెల్లర్‌లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్‌ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.

ఉగ్రవాదులు నక్కిన వీడియో చూడండి: