AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే వేదికపై మోదీ.. ట్రంప్.. అదే మెగా ఈవెంట్ !

టెక్సాస్ లో ఈ నెల 22 న జరగనున్న ‘ హౌడీ మోడీ ‘ మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికపై కూచుని ‘ కనువిందు ‘ చేయనున్నారు. మోదీతో కలిసి ట్రంప్ కూడా ఆ రోజున వేదికను అలంకరిస్తారని వైట్ హౌస్ ఆదివారం ప్రకటించింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ మెగా ఈవెంట్ దోహదపడుతుందని […]

ఒకే వేదికపై మోదీ.. ట్రంప్.. అదే మెగా ఈవెంట్ !
Anil kumar poka
|

Updated on: Sep 17, 2019 | 1:29 PM

Share

టెక్సాస్ లో ఈ నెల 22 న జరగనున్న ‘ హౌడీ మోడీ ‘ మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికపై కూచుని ‘ కనువిందు ‘ చేయనున్నారు. మోదీతో కలిసి ట్రంప్ కూడా ఆ రోజున వేదికను అలంకరిస్తారని వైట్ హౌస్ ఆదివారం ప్రకటించింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ మెగా ఈవెంట్ దోహదపడుతుందని భావిస్తున్నారు. హూస్టన్ లోని ఎన్ ఆర్ జీ స్టేడియం లో 22 న జరిగే ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా ఇండియన్ అమెరికన్లు హాజరు కానున్నారు. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేత పాల్గొననున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు హాజరు కావడం ఇదే మొదటిసారి.

భారత, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ ఈవెంట్ దోహదపడుతుందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. హోస్టన్ లో జరిగే ఈ కార్యక్రమంలో యుఎస్ హౌస్ లోని మెజారిటీ లీడర్, మేరీలాండ్ లో రెండో అత్యున్నత డెమొక్రాట్ స్టెనీ హోయర్స్ ప్రసంగిస్తారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే తొలి అమెరికన్-హిందూ కాంగ్రెస్ మహిళా ఎంపీ తులిసీ గబార్డ్, ఇండియన్-అమెరికన్ సెనెటర్ రాజా కృష్ణమూర్తి సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, ఇతర అధికారులతో కూడిన ప్రతినిధిబృందం కూడా ఈ మెగా ఈవెంట్ లో పాల్గొననుంది.

మోదీ-ట్రంప్ భేటీ సందర్భంగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదురుతాయని, ముఖ్యంగా భారత్ తో తమ వాణిజ్య లావాదేవీలు మరింత పెరగవచ్చునని అమెరికాలోని ఇంధన కంపెనీలు ఆశిస్తున్నాయి. టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అక్కడి వెయ్యిమంది వాలంటీర్లు, 650 సంస్థల సభ్యులు సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది ‘ స్పెషల్ గెస్చర్ ‘ అని పేర్కొన్నారు. ఈ నెల 22 న అమెరికాలోని భారతీయులు ఆ సందర్భంగా ట్రంప్ ను ఆహ్వానించబోతున్నారు. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాను ‘ అని ఆయన అన్నారు. మోదీతో గాఢ మైత్రిని కోరుతున్న ట్రంప్- ఈ మెగా ఈవెంట్ కు తాను హాజరుకానున్నానని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తన ప్రభుత్వ అధికారులను, సీక్రెట్ సర్వీసును ఆదేశించారు. ఈ ఏడాది ఈ ఇద్దరు నాయకులూ భేటీ కావడం ఇది మూడోసారి.

Follow Us
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన