Train Ticket: పండగలాంటి అదరిపోయే శుభవార్త.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు రైలులో ప్రయాణించవచ్చు.. కానీ..!

|

Jun 16, 2021 | 10:16 PM

Train Ticket: రైలులో ప్రయాణించాలంటే ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఎందుకంటే సమయానికి టికెట్‌ దొరక్కపోతే మరో ట్రైన్‌ కోసం ఆగాల్సి ఉంటుంది. దీంతో సమయం..

Train Ticket: పండగలాంటి అదరిపోయే శుభవార్త.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు రైలులో ప్రయాణించవచ్చు.. కానీ..!
Follow us on

Train Ticket: రైలులో ప్రయాణించాలంటే ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఎందుకంటే సమయానికి టికెట్‌ దొరక్కపోతే మరో ట్రైన్‌ కోసం ఆగాల్సి ఉంటుంది. దీంతో సమయం వృధా అయి నిరాశకు గురవుతుంటాము. ఒక వేళ రైలు బయలుదేరే సమయానికి రైల్వే స్టేషన్‌కు వస్తే టికెట్‌ కోసం క్యూలో నిలబడే లోపే ట్రైన్‌ బయలుదేరుతుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు పండగలాంటి అదిరిపోయే శుభవార్త చెప్పింది భారతీయ రైల్వే శాఖ. ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోకపోయినా.. టికెట్‌ తీసుకోకపోయినా కూడా ఏ మాత్రం టెన్షన్‌ పడకుండా రైలులో ప్రయాణం చేయవచ్చు.

కానీ ఓ విషయం గుర్తించుకోవాలి. కేవలం ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు రైలులోకి ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్‌ తీసుకుంటే సరిపోతుంది. అంటే ట్రైన్‌ తీసుకోకపోయినా.. ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ ఉంటే సరిపోతుంది. పూర్తి ఛార్జీలతో రైలు ఎక్కిన తర్వాత టీటీఈ ద్వారా టికెట్‌ తీసుకునే వెలుసుబాటు ఉంది. చివరి నిమిషంలో హడావిడిగా రైల్వే స్టేషన్‌కు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈ అద్భుతమైన సౌకర్యం పొందవచ్చు. రిజర్వేషన్‌ లేకుండా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అక్కడి టికెట్‌ కౌంటర్ల ముందు బారులు తీరిన లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. యూటీసీ యాప్ ద్వారా లేదా స్టేషన్లలోని వెండింగ్ మెషిన్ల ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌తో రైలు ఎక్కేయచ్చు. రైలు ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్‌ తీసుకోవచ్చు. అంతేకాదు సీట్లు అందుబాటులో ఉంటే రిజర్వేషన్‌ చేయించుకుని బెర్త్‌ కూడా సంపాదించుకోవచ్చు.

ఇవీ కూాడా చదవండి:

Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్‌

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!