AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2-DG Drug: అన్ని వేరియంట్లకు 2డీజీ డ్రగ్ రక్షణ కవచమే… తాజా అధ్యయనంలో వెల్లడి

DRDO - 2-DG: కరోనా బారినపడి మృత్యువుతో పోరాడేవారికి ఈ ఔషధం బాగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవిడ్ ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా 2డీజీ డ్రగ్ కాపాడుతుంది.

2-DG Drug: అన్ని వేరియంట్లకు 2డీజీ డ్రగ్ రక్షణ కవచమే... తాజా అధ్యయనంలో వెల్లడి
2-DG Drug
Janardhan Veluru
|

Updated on: Jun 16, 2021 | 9:38 PM

Share

DRDO anti-Covid Drug 2-DG: కొవిడ్-19తో బాధపడుతున్న రోగుల కోసం ఓ వైపు పలు వ్యాక్సిన్లు వస్తుండగా.. అటు కొత్తకొత్త ఔషధాలు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంపై ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO)-డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2డీజీ డ్రగ్ కరోనా రోగుల పాలిట ఆశాకిరణంగా నిలుస్తోంది. కరోనా బారినపడి మృత్యువుతో పోరాడేవారికి ఈ ఔషధం బాగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవిడ్ ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా 2డీజీ డ్రగ్ కాపాడుతుంది. త్వరలోనే రోగులకు అందుబాటులో రానున్న ఈ యాంటి కోవిడ్ డ్రగ్.. కొవిడ్‌ చికిత్సలో కీలకంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డ్రగ్ సామర్థ్యానికి సంబంధించి నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడయ్యింది. కొవిడ్-19 అన్ని వేరియంట్లపైనా ఈ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు అనంత నారాయణ భట్, అభిషేక్ కుమార్, యోగేష్ రాయ్, దివియ యాదగిరిలతో కూడిన బృందం పరిశీలనలో తేలింది.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. మే 19న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ యాంటి కోడివ్ డ్రగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. 2డీజీ డ్రగ్ వాడిన తర్వాత వైరస్ వృద్ధి చెందడం తగ్గుతున్నట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు. సాచెట్ ప్యాకెట్ రూపంలో ఇది మార్కెట్‌లోకి రానుంది. దీని ధరను ఒక్కో సాచెట్ రూ.990గా నిర్ణయించారు. దీన్ని మంచినీళ్లలో కలుపుకుని తాగిన వెంటనే అది పనిచేయడం మొదలుపెడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో దీన్ని వాడిన రోగులు త్వరగా కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు.

2డీజీ డ్రగ్ వినియోగానికి మార్గదర్శకాలివే..

దీని వినియోగంపై గత వారం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్‌కు అనుమతించినట్లు డీఆర్డీవో తెలిపింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్‌ను వినియోగించాలని స్పష్టంచేసింది. గరిష్ఠంగా 10 రోజుల పాటు ఈ మందును ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దని స్పష్టంచేసింది. రోగులతోపాటు వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించొచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సప్లై కోరవచ్చని డీఆర్‌డీవో పేర్కొంది.

Also Read..కేవలం 15 నిమిషాల్లోనే గదిలో కరోనాను గుర్తించే కొత్త పరికరాన్ని కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే ……కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ