Puja Khedkar: అలా చేస్తే.. ఇలానే ఉంటాది మరి.. ట్రైయినీ IAS పూజా ఖేద్కర్‌కు దిమ్మతిరిగే షాక్..

|

Jul 16, 2024 | 9:07 PM

ట్రైయినీ IAS పూజా ఖేద్కర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వరుస వివాదాలతో ఇరుక్కున్న పూజను శిక్షణను నిలిపి వేసిన ప్రభుత్వం ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీకి వెనక్కి పంపించింది. పుణేలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందిన పూజ అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. తన ఆడి కారుకు బ్లూ రెడ్‌ బికాన్‌ లైట్‌ను పెట్టుకొని అధికార దర్పాన్ని ప్రదర్శించారు.

Puja Khedkar: అలా చేస్తే.. ఇలానే ఉంటాది మరి..  ట్రైయినీ IAS పూజా ఖేద్కర్‌కు దిమ్మతిరిగే షాక్..
Puja Khedkar
Follow us on

పుణేలో గొంతెమ్మ కోర్కెలతో వివాదాల్లో నిలిచిన ట్రైయినీ IAS పూజా ఖేద్కర్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆమె ట్రయినింగ్‌ను నిలిపివేసిన ప్రభుత్వం వెంటనే ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీకి రావాలని ఆదేశించింది. రెండు రోజుల క్రితమే ఆమెను పుణే నుంచి వాషీంకు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అయితే వరుస వివాదాలు వెలుగు లోకి రావడంతో ఆమెపై మరోసారి చర్యలు తీసుకున్నారు. పుణేలో అనుమతి లేకుండా బుగ్గ కారును వాడడంపై పూజా ఖేద్కర్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్‌ సర్టిఫికేట్‌తో మెడిసిన్‌ చదివినట్టు, ఐఏఎస్‌ ఉద్యోగం పొందినట్టు కూడా పూజపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

నాన్‌ క్రిమీలేయర్‌ ఓబీసీ సర్టిఫికేట్‌తో పూజ ఎంబీబీఎస్‌ సీటు పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి పూజా ఖేద్కర్‌ నివాసానికి ఆరుగురు మహిళా పోలీసులు రావడం సంచలనం రేపింది. కొన్ని విషయాలపై పూజను పోలీసులు క్లారిటీ కోరినట్టు తెలుస్తోంది. కంటిచూపు సమస్యలపై పూజ అధికారులకు సమర్పించిన సర్టిఫికేట్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆమెకు ఉన్న మానసిక సమస్యలపై కూడా విచారణ కమిటీ దర్యాప్తు జరుపుతుంది.

పుణేలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందిన పూజ అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. తన ఆడి కారుకు బ్లూ రెడ్‌ బికాన్‌ లైట్‌ను పెట్టుకొని అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆమె ఈ కారును ఉపయోగించారు. అంతేకాకుండా విలాసవంతమైన ఆఫీస్‌ కావాలని అధికారులకు లేఖ రాశారు. దీంతో ఆమెపై వరుస ఫిర్యాదులు వచ్చాయి.

ఇదే సమయంలో ఓబీసీ సర్టిఫికేట్‌ వివాదం కూడా తెరపైకి వచ్చింది. పూజ తండ్రి మహరాష్ట్రలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా రిటైర్‌ అయ్యారు. 40 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌ ఇచ్చారు. దీంతో పూజకు ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ కోటా వర్తించదని కొందరు చెబుతున్నారు. అయితే.. ఓబీసీ కోటాలోనే ఆమె ఉద్యోగం పొందారు. దీంతో ఆమె విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..