డ్రైవర్ లేకుండానే ట్రైన్ ప్రయాణం.. తప్పిన ఘోర ప్రమాదం!

డ్రైవర్ లేకుండానే ట్రైన్ ప్రయాణం.. తప్పిన ఘోర ప్రమాదం!

రాజస్థాన్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ ట్రైన్ 40 కిలోమీటర్లు ప్రయాణించింది. ఏ ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… సెంద్రా రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలు.. డ్రైవర్ లేకుండానే ఉన్నట్లుండి కదిలింది.. అంతేకాకుండా ఒక్కసారిగా స్పీడ్ అందుకుని వేగంగా పరుగులు పెట్టింది. దీన్ని గమనించిన రైల్వే అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తర్వాతి స్టేషన్లకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఆ ట్రైన్ వెళ్లే మార్గంలోని […]

Ravi Kiran

|

Sep 18, 2019 | 4:35 PM

రాజస్థాన్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ ట్రైన్ 40 కిలోమీటర్లు ప్రయాణించింది. ఏ ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… సెంద్రా రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలు.. డ్రైవర్ లేకుండానే ఉన్నట్లుండి కదిలింది.. అంతేకాకుండా ఒక్కసారిగా స్పీడ్ అందుకుని వేగంగా పరుగులు పెట్టింది. దీన్ని గమనించిన రైల్వే అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తర్వాతి స్టేషన్లకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు.

ఆ ట్రైన్ వెళ్లే మార్గంలోని రైల్వే గేట్లన్నింటిని మూసేసి.. పట్టాలపై రాళ్లు, బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరికి ఏమైందో ఏమో గానీ సోజాత్ స్టేషన్ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. దీనితో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu