
Amarnath Yatra: భారీ వర్షాలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఇక అమర్‌నాథ్‌లో భారీ వర్షం కురుస్తోంది. వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు కిలోమీటర్ల మేర మేఘం బద్దలై భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. కుంభవృష్టి వర్షంతో దాదాపు 12వేల మంది భక్తులు అక్కడే ఉండిపోయారు. భయంతో వణికిపోతున్నారు. కొండలపై నుంచి భారీగా పోటెత్తుతున్న వరదలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరదల కారణంగా ఎంత మంది గల్లంతయ్యారో ఊహించని పరిస్థితి నెలకొంది. వందలాది మంది భక్తులు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భోలేనాథ్ సమీపంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో అమర్‌నాథ్ యాత్రను మళ్లీ నిలిపివేసింది ప్రభుత్వం. ఇప్పటికి ఐదుగురి మృతదేహాలను గుర్తించారు అధికారులు. వరదల కారణంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే వందలాది మంది మరణించి ఉంటారని అంచనా. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అందరు అప్రమత్తంగా ఉండాలని జమ్మూకశ్మీర్ ఐజీపీ తెలిపారు.
ఈ అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. జమ్మూలో ఆకస్మిక వరదలు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమర్‌నాథ్ గుహ పరిసరాలలో భారీగా వరద నీరు చేరింది. వరదల్లో చిక్కుకుని ఐదుగురు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు గుర్తించారు అధికారులు. మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొండ ప్రాంతం నుంచి వరదనీరు పోటెత్తుతోంది. వరదల్లో భక్తుల గుడారాలు సైతం కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో అక్కడ ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ వరదల కారణంగా భక్తులు బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి