Traffic Challans: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ఆ స్టిక్కర్లు ఉంటే భారీ జరిమానా.. ఇప్పటికే 2 వేల కార్లకు చలాన్లు..

|

Aug 24, 2023 | 6:27 AM

Traffic Challans: డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆర్‌సీ బుక్ వంటివి లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుంటారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాహనాలకు కుల, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు అట్టించే ధోరణిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌లో కృష్టి చేస్తున్నారు అక్కడి పోలీసులు. కార్ బంపర్లు, విండ్‌షీల్డ్‌లు, ఇతర వెహికిల్ భాగాలపై కులం, మతాన్ని సూచించే స్టిక్కర్స్‌ని అతికిస్తే చలాన్లు తప్పవంటున్నారు యూపీ పోలీసులు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్..

Traffic Challans: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ఆ స్టిక్కర్లు ఉంటే భారీ జరిమానా.. ఇప్పటికే 2 వేల కార్లకు చలాన్లు..
Vehicle Challan
Follow us on

Traffic Challans: వాహనం ఏదైనా రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాల్సిందే. చట్టపరమైన ఏ రూల్‌ని అతిక్రమించినా భారీ జరిమానా లేదా శిక్షను పొందక తప్పదు. సాధారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆర్‌సీ బుక్ వంటివి లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుంటారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాహనాలకు కుల, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు అట్టించే ధోరణిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌లో కృష్టి చేస్తున్నారు అక్కడి పోలీసులు. కార్ బంపర్లు, విండ్‌షీల్డ్‌లు, ఇతర వెహికిల్ భాగాలపై కులం, మతాన్ని సూచించే స్టిక్కర్స్‌ని అతికిస్తే చలాన్లు తప్పవంటున్నారు యూపీ పోలీసులు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 (1) కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ఇక ఈ సెక్షన్‌ని విధిగా పాటిస్తున్న యూపీ పోలీసులు.. రూల్‌ని అతిక్రమించిన 2,300 కార్లకు ఇప్పటికే చలాన్లు విధించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 వరకు మొత్తం 10 రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకముందు కుల, మతాలను సూచించే ఏ విధమైన స్టిక్కర్‌ని అయిన ప్రదర్శించడం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమేనని నోయిడాలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సూచనల మేరకు చట్టం అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

మరోవైపు పోలీసుల హెచ్చరికలను అతిక్రమించినవారిపై ఇప్పటివకే జరిమానాలు విధించారు. కులం లేదా మతాన్ని సూచించే పదాలు లేదా స్టిక్కర్లను తమ వాహనాలపై ప్రదర్శిస్తే.. వాహనాలకు రూ.1,000 జరిమానా.. నంబర్ ప్లేట్‌పై ఆ స్టిక్కర్లు కనిపిస్తే రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉందని సమాచారం. మోటారు వాహన చట్టం ప్రకారం, నంబర్ ప్లేట్‌పై వెహికిల్‌కి కేటాయించిన నంబర్ కాకుండా ఇతర ఏ విధమైన గుర్తులు, అక్షరాలు ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసిన యోగీ ప్రభుత్వం.. కులాన్ని సూచించేలా స్టిక్కర్లను ప్రదర్శిస్తే వాహనాలను సీజ్ కూడా చేస్తామని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యూపీ అదనపు రవాణా కమీషనర్ ముఖేష్ చంద్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ అదేశాలను పంపించారు. ఈ విధమైన ఉత్తర్వులు ట్రాఫిక్ నిబంధనలను సమర్థించడంతో పాటు వాహనాలపై కుల, మత గుర్తులను ప్రదర్శించే సంస్కృతికి చరమగీతం పాడడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..