Rahul Gandhi Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీపీసీసీ..

Rahul Gandhi Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ కోసం టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. అక్టోబర్‌ 24 నుంచి దాదాపు 15 రోజులు..

Rahul Gandhi Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీపీసీసీ..
Rahul Gandhi

Updated on: Sep 06, 2022 | 12:15 PM

Rahul Gandhi Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ కోసం టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. అక్టోబర్‌ 24 నుంచి దాదాపు 15 రోజులు తెలంగాణలో యాత్ర నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందిస్తోంది. ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, ఆ17 స్థానాల పరిధిలోని ముఖ్య నాయకులు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో రాహుల్‌ భేటీ అయి.. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.

రాహుల్‌ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే చోట భారీ స్థాయిలో స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలను టీపీసీసీ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేలా ఈ కార్యక్రమాలుండనున్నాయి. మరోవైపు 5 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. రాహుల్‌తో కలిసి దేశ వ్యాప్తంగా నడిచే 118 మంది బృందంతో పాటు.. రాష్ట్రంలోని 100 మంది నాయకులు కూడా తెలంగాణలో ఆయనతో కలిసి నడవనున్నారు. ఈ 100 మంది బృందంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై టీపీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరెవరు యాత్రలో పాల్గొనాలనే దానిపై ముందుగానే నిర్ణయం తీసుకుని వారికి పాస్‌లు కూడా జారీ చేయనున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..