Triple Talaq: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. భర్త చెప్పిన కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అంతే..!
సమాజంలో వివాహ బంధం వీకవుతోంది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ విషయంలో
సమాజంలో వివాహ బంధం వీకవుతోంది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ విషయంలో పలువురు చెప్పే రీజన్స్ సిల్లీగా అనిపిస్తాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్ లో ఓ వ్యక్తి తన భార్య వెయిట్ పెరిగిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన బాధితురాలు.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసింది. తనకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయిందని, ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని వివరించింది. నెల రోజుల క్రితం ‘లావు అయిపోయావు..’ అంటూ ట్రిపుల్ తలాక్ చెప్పి భర్త ఇంటి నుంచి గెంటివేశాడని కన్నీటిపర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మూడు సార్లు ‘తలాక్’, ‘తలాక్’, ‘తలాక్’ అని చెప్తే విడాకులు ఇచ్చేసినట్లే. ఈ అంశంపై ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో భారీగా పిటిషన్లు వేశారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. నిబంధనలను అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. కాగా.. ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించగా.. తాజాగా ఇండియా కూడా ఈ లిస్ట్‌లో చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

