Viral: వీర వనిత.. కొడుకును కాపాడుకునేందుకు పులితో భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే..?
రోహానియాకు చెందిన 25 ఏళ్ల అర్చనా చౌధరి అనే మహిళ తన 15 నెలల కుమారుడు రవిరాజ్‌ను తీసుకుని పొలానికి వెళ్లింది. ఆ సమయంలో మాటేసి ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసి.. బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది.

Woman fights off Tiger: ఎదురుగా పులి.. అయినా ఆ తల్లి భయపడ లేదు.. పులి నోట్లో కొడుకుని చూసిన ఆమె ఒక్కసారిగా శివంగిలా మారింది. తన 15 నెలల కుమారుడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి క్రూర మృగంతో పోరాడింది. మెడపై గాయమైనా.. పులి పంజా గాట్లు శరీరాన్ని బాధిస్తున్నా వెనుకడుగు వేయలేదు.. ఇలా సుమారు 25 నిమిషాలు పోరాడిన ఆ తల్లి.. తన చిన్నారి ప్రాణాలను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా రోహానియా గ్రామంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలోని రోహానియా ప్రాంతం బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ మాల బీట్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే.. రోహానియాకు చెందిన 25 ఏళ్ల అర్చనా చౌధరి అనే మహిళ తన 15 నెలల కుమారుడు రవిరాజ్‌ను తీసుకుని పొలానికి వెళ్లింది. ఆ సమయంలో మాటేసి ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసి.. బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. ఈ క్రమంలో క్షణాల్లో అలెర్ట్ అయిన అర్చన పులికే ఎదురుతిరిగింది. కుమారుడిని రక్షించుకొనేందుకు పులితో భీకరంగా పోరాడింది.
ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా లెక్క చేయకుండా 25 నిమిషాల పాటు పులిని అడ్డుకుంది. ఆ తర్వాత గ్రామస్థులు రావడంతో పులి.. చిన్నారిని వదిలిపెట్టి అడవిలోకి పారిపోయింది. అనంతరం స్థానికులు గాయాల పాలైన అర్చనను, ఆమె కుమారుడిని మెరుగైన చికిత్స కోసం జబల్‌పుర్‌కు తరలించారు. మహిళ నడుము, చేయి, వీపుపై గాయాలు కాగా, కుమారుడికి తల, వెన్నముకకి గాయాలయ్యాయని ఫారెస్ట్ గార్డు రామ్ సింగ్ మార్కో తెలిపారు.

Mp News
కాగా, సమచారం అందుకున్న అధికారులు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో పులిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..