Tamil Nadu Class 12 board exams: కళాశాల విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న వారికి పెద్ద ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పరీక్షలను రద్దుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 12వ తరగతి బోర్డు పరీక్షలతో పాటు టిఎన్ హెచ్ఎస్సీ+2 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. వారందరి నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఊరట లభించింది. అయితే, విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రాబల్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. థర్డ్ వేవ్ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, నిపుణులతో మూడు రోజుల సంప్రదింపుల తరువాత, ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఈ సంవత్సరానికి 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కమిటీ సిఫారసు ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాగా, విద్యార్థులు అయా కళాశాలల్లో కోర్సుల అడ్మిషన్లను బట్టి గ్రేస్ మార్కులు ఉంటాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 11 వ తరగతి పరీక్షలతో పాటు టిఎన్ ఎస్ఎస్ఎల్సీ 10వ తరగతి బోర్డు పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
Read Also… ఢిల్లీలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేసిన కేంద్రం….. ఇది రాజకీయ కక్షేనంటున్న ఆప్ నేతలు