West Bengal Election: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఉద్రిక్తత.. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ కారుపై రాళ్లతో దాడి..
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయం కాస్తా రణరంగంగా మారిపోతోంది. రాజకీయ పార్టీల మధ్య నిత్య ఘర్షణలతో ఆ రాష్ట్రం..
West Bengal Election: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయం కాస్తా రణరంగంగా మారిపోతోంది. రాజకీయ పార్టీల మధ్య నిత్య ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇప్పటికే పలు హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోగా.. తాజాగా మరో దాడికి సంబంధించిన ఘటన వెలుగు చూసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సునీల్ మోండల్ ఆ పార్టీని వీడి వారం క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి కలకత్తాలోని బీజేపీ ఆఫీసుకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే విషయం తెలుసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోండల్ వెళ్తున్న కారును ఘోరావ్ చేశారు. ఆ సందర్భంగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొందరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోండల్ కారుపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత రాయ్.. దీనిని ‘అర్థవంతమైన నిరసన’గా అభివర్ణించారు.
Also read:
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు..ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్సీఎస్ ప్రకటన