
పశ్చిమబంగలో వివాదం నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కోల్ కతా లోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్ ను వ్యాధి రహితంగా మార్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ.. యూపీ, బిహారిలు లేని పశ్చిమ బంగ గా మార్చాలని ఎద్దేవా చేశారు.
My humble question to Bihari Babu Shri @ShatruganSinha ji, Sir, what do you feel about this disgraceful rant of TMC MLA Manoranjan Byapari?
Your new party colleague is very transparent about his feelings towards Biharis. His recent speech at the Kolkata International Book Fair: pic.twitter.com/3vtVln6tdH— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022
Also Read
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..