Mukul Roy’s wife dies: తృణమూల్ నేత ముకుల్ రాయ్ సతీమణి కృష్ణరాయ్ కన్నుమూత..

Mukul Roy's wife Krishna dies: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ సతీమణి కృష్ణ రాయ్ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కృష్ణరాయ్ మంగళవారం

Mukul Roys wife dies: తృణమూల్ నేత ముకుల్ రాయ్ సతీమణి కృష్ణరాయ్ కన్నుమూత..
Mukul Roy

Updated on: Jul 06, 2021 | 11:53 AM

Mukul Roy’s wife Krishna dies: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ సతీమణి కృష్ణ రాయ్ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కృష్ణరాయ్ మంగళవారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ రాయ్ మంగళవారం తెల్లవారుజామున 4:35 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే.. ఆమె మృతదేహాన్ని రేపు కోల్‌కతాకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కృష్ణరాయ్ మ‌ృతి పట్ల పలువురు టీఎంసీ నాయకులు సంతాపం ప్రకటించారు.

టీఎంసి వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ముకుల్ రాయ్.. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరి.. మళ్లీ టీఎంసీలో చేరారు. 2017లో బీజేపీలో చేరి.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై కృష్ణానగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముకుల్ రాయ్ విజయం సాధించారు.

ఇటీవలనే తన కుమారుడు సుభ్రంగ్షు రాయ్‌తో కలిసి బెంగాల్‌ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో సమావేశమై.. మరలా సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా.. ముకుల్ రాయ్, ఆయన సతీమణి కృష్ణ రాయ్ ఇటీవలనే కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Also Read:

కస్టడీ నుంచి క్రిమినల్స్ పారిపోవడానికి యత్నిస్తే షూట్ చేయండి.. పోలీసులకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ హితవు..కానీ..

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేళ..షికాగోలో ప్రజ్వరిల్లిన హింస..కాల్పుల్లో 14 మంది మృతి