TTD News: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్! మే 1 నుంచి తెరుచుకోనున్న శ్రీవారి మెట్ల మార్గం

శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం మళ్ళీ అమలు చేసే యోచనలో ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఈ రోజు (ఏప్రిల్‌ 18) మీడియాకు తెలిపారు..

TTD News: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్! మే 1 నుంచి తెరుచుకోనున్న శ్రీవారి మెట్ల మార్గం
Ttd
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2022 | 3:30 PM

Tirumala Tirupati Temple plans to re-implement the Srivari Slotted Sarvadarshana soon: శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం మళ్ళీ అమలు చేసే యోచనలో ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఈ రోజు (ఏప్రిల్‌ 18) మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ఏప్రిల్ 12 నుండి రెండు రకాల దర్శనాలు అమల్లోకొచ్చాయి. ధర్మ దర్శనానికి వైకుంఠంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. భక్తులకు 8 నుంచి 9 గంటల్లో ధర్మదర్శనం లభిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్లాటెడ్ సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తాం. స్లాట్ దొరకని భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచివుండి దర్శించుకునే పద్ధతిని కొనసాగిస్తాం. గత నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల నడకమార్గం (srivari mettu steps) అందుబాటులోకి వచ్చాక, కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను కేటాయిస్తాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం (Alipiri footpath) ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటయింపు పునరుద్ధరణ జరుగుతుందన్నారు.

తిరుమలలో మునుపటి పరిస్థితి నెలకొంటోంది. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. అనూహ్యంగా పెరిగిన రద్దీ దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లతో టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. లగేజీ కేంద్రాల నిర్వహణ కాంట్రాక్టును ప్రవేటు కంపెనీలకు త్వరలో ఇవ్వనున్నాం. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు దాదాపు 5,29,966 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం. 24,34,744 లడ్డూలను భక్తులకు విక్రయించాం. ఈ వారంలో రోజుల్లో రూ. 32.49 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 2,39,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 10,55,572 మంది భక్తులకు అన్నవితరణ చేశాం. మరమ్మత్తులకు గురై‌న 3,811 గదుల్లో 2960 గదులను మరమ్మత్తులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏప్రిల్ 12 నుంచి టిక్కెట్టు లేని భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నాం. క్యూలైన్లు, కంపార్టమెంట్లలో నిర్విరామంగా అన్నపానీయాలు, పాలు అందజేస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనభాగ్యం కల్పిస్తున్నాం. ఎలాంటి అపోహలకు పోకుండా భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఈ మేరకు సూచించారు.

Also Read:

TS Police jobs 2022: వారంలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మంత్రి హరీశ్ రావు వెల్లడి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!